వైర‌ల్‌: ఫుట్‌బాల్ స్కిల్‌తో అదరగొట్టిన ఎలుగుబంట్లు…

ప్ర‌పంచంలో అత్యంత ఎక్కువ మంది ఇష్ట‌ప‌డే గేమ్ ఫుట్‌బాల్‌.  యూర‌ప్‌, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ క్రీడ‌ల‌కు మంచి ప్రాచుర్యం ఉన్న‌ది.  మ‌న‌దేశంలో కూడా ఈ గేమ్‌కు ఆద‌ర‌ణ ఉన్నా, దానికి త‌గిన మౌళిక స‌దుపాయాలు, శిక్ష‌ణ లేక‌పోవ‌డంతో కొంత వెన‌క‌బ‌డి ఉన్న‌ది.  అయితే, కొన్ని ప్రాంతాల్లో పిల్ల‌లు గ‌ల్లీగ్ల‌లీల్లో ఆ ఫుట్‌బాల్ గేమ్ ఆడుతుంటారు.  ఒడిశాలోని స‌బ‌రంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ అనే గ్రామంలో పిల్ల‌లు ఫుట్‌బాల్ గేమ్ అడుతుండ‌గా ప‌క్క‌నే ఉన్న అడ‌విలోనుంచి రెండు ఎలుగు బంట్లు వ‌చ్చాయి.  వాటిని చూసి పిల్ల‌లు బంతిని వ‌దిలేసి ప‌రుగులు తీశారు.  అయితే, రెండు ఎలుగుబంట్లు ఆ బంతితో వాటిలోని నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాయి.  కాళ్ల‌తో బంతిని తుంతూ, ముందు కాళ్ల‌తో ఎగ‌రేస్తూ, మూతితో బంతిని ప‌ట్టుకొని ప‌రుగులు తీశాయి.  దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

Read: ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తికి తొలిసారి ఇలా…!!

Related Articles

Latest Articles

-Advertisement-