దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకి తీవ్రం అవుతోంది. కరోనా మహమ్మారికి మళ్లీ ప్రమాద గంటికలు మోగిస్తోంది. కొత్త వేరియంట్ల రూపాన్ని సంతరించుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ మళ్లీ భయపడే స్థాయికి చేరాయి. జనవరి, ఫిబ్రవరిలో వందల్లో నమోదు అయిన కేసులు తిరిగి ఇప్పుడు గరిష్టానికి పెరిగాయి.
గత కొద్ది రోజులుగా కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. నిన్న ఏడు వేలపై చిలుకు కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య పది వేలకు చేరింది. భారతదేశంలో ఈరోజు 10,158 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 30 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి పెరిగింది. దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,42,10,127కి చేరుకుంది.
Also Read:Gehlot vs Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం.. గెహ్లాట్-పైలట్ అంశంపై సమావేశం
నిన్న 7,830 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య పది వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. రాబోయే 10-12 రోజులలో కేసులు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ XBB.1.16 తాజా ఉప్పెనకు కారణమైంది. ఇది ఆందోళనకు కారణం కాదని, టీకాలు దీనికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. సబ్‌వేరియంట్ యొక్క ప్రాబల్యం ఫిబ్రవరిలో 21.6% నుండి మార్చిలో 35.8%కి పెరిగింది. అయితే ఆసుపత్రిలో చేరడం లేదా మరణించిన సంఘటన ఏదీ సమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read:Gehlot vs Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం.. గెహ్లాట్-పైలట్ అంశంపై సమావేశం