Pawan Kalyan: నేను సాధించిన దానికి సంతోషం లేదని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో.. మనల్నిఎవడ్రా ఆపేది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.. మనదేశం సంపద యువత.. యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తానని ప్రకటించారు.. ఇక, నేను సాధించిన దానికి సంతోషం లేదు.. నేను ఈరోజు ప్రతి సన్నాసి, యదవ చేత మాట అనిపించుకోకుండా ఉండగలను.. కానీ, కేవలం మనకోసం జీవించే జీవితంకాకుండా సాటిమనిషి గురించి బతకడం ఇష్టం అన్నారు.. రాజకీయ నేతలు ప్రజల్ని బానిషలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా వద్ద ఇంత సమూహాం లేదు.. ఇప్పుడు తెగించి కొట్లాడుతా.. మహాఅయితే నాప్రాణం పోవచ్చు.. కానీ, పిరికి తనం నాకు చిరాకు అన్నారు పవన్ కల్యాణ్.
Read Also: Covid 19: వ్యాక్సిన్ కోసం చైనీయుల పాట్లు.. హాంకాంగ్‌కు పరుగులు..
ఈ రాజకీయ నాయకులు ఏమైనా దిగొచ్చారా? అంటూ ఫైర్ అయ్యారు పవన్.. ఉత్తరాంధ్ర పొరాటాల గడ్డ.. ఉపాధిలేనప్పుడు, వలసపై నాయకులు నిలదీయలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.. నాకు గిడుగు రామ్మూర్తి, శ్రీ శ్రీ లాంటి వాళ్లు ఆదర్శమని ప్రకటించిన పవన్.. సవరబాష నిగంఠువులు తయారుచేసిన మహానీయుడు గిడుగు.. తెలుగుభాష ఆధుణీకీకరణ కోసం వీధిపోరాటలు చేసిన మహానీయుడని గుర్తుచేసుకున్నారు.. స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఆజాద్ ఆత్మత్యాగాలు చేస్తే.. మనం సాటి మనుసులకు ఏం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.. గెలుస్తానో ఓడిపోతానో కాదు.. నాకు పోరాటమే తెలుసు.. ఎదవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం కూడా తెలుసని హెచ్చరించారు. ఇక, ఉత్తరాంధ్ర యాత్ర చేసినప్పుడు నా వద్ద, పార్టీ వద్ద డబ్బులు లేవన్నారు పవన్.. నాకు సుఖాలమీద మమకారం లేదన్న ఆయన.. ఉద్దానంలో సరైన త్రాగునీరు లేఖ రోగులైన వ్యక్తులను చూశాను.. ఉపాధి లేఖ నలిగిపోతున్న యువతను చూశాను.. సభలకు వచ్చి చప్పట్లు కొట్టి ఓట్లు వేసేటప్పుడు వదిలేశారంటూ వ్యాఖ్యానించారు. నాకు ప్రెస్టేజ్ లేదు, నాకు ఆశాభంగం లేదు.. నాకు చూడని డబ్బా , పేరు ప్రతిష్టలా..? అని చెప్పుకొచ్చారు పవన్.