తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వానికి మాట తప్పే జబ్బు.. మనస్సు మార్చుకునే జబ్బు వచ్చిందని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ కరోనా జబ్బు మమ్మల్నేం చేయలేదని, ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హడావుడిగా జీతాలు వేసేశారని, చనిపోయిన వారికీ జీతాలు వేసేశారని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ తీసేయాలన్న మంత్రి బుగ్గన ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా మాకు జీతాలు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానిదంతా రివర్సేనని ఆయన…
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ పై ఆఏపీలోని ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీని కలిసిన ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వైఎస్సార్ పీటీడీ ఉద్యోగుల…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.…
ఏపీలో కొత్త పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా పీఆర్సీపై స్పష్టత లేదని, పీఆర్సీ పై స్పష్టత వచ్చే వరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త జీతాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ఏపీ ప్రభుత్వం…
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు.…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు…