తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి.. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు.. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టు రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.. మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఇక, విశాఖపట్నంలోని అనురాధ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతేకాదు, ఇటీవల కాలంలో మృతిచెందిన మావోయిస్టు టాప్ లీటర్ ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురణపై కూడా ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడుగా పనిచేసి రవిశర్మ.. ఇటీవల కాలంలో లొంగిపోయారు.. ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించడం చర్చగా మారింది..
Read Also: నేడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు.. ఆసక్తిగా చూస్తోన్న టీడీపీ..!
అయితే, సోదాలను ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయి.. ఇవాళ ఉదయం 5 గంటలకు ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం సీనియర్ సభ్యుడు, ప్రముఖ రచయిత కళ్యాణ్‌రావు ఇంటి మీదికి పోలీసులు వెళ్లారని.. విశాఖపట్నంలో ప్రగతిశీల కార్మిక సంఘం నాయకురాలు అన్నపూర్ణ ఇంట్లో పోలీసులు సోదాలు మొదలు పెట్టారని.. హైదరాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో అమరుల బంధుమిత్రుల సంఘం సహాయ కార్యదర్శి భవాని ఇంటికి పోలీసులు వెళ్లారని మండిపడుతున్నారు.. పెద్ద ఎత్తున పోలీసులు బస్తీని చుట్టుముట్టి ఎవరినీ ఇళ్లలోంచి బయటకు రానివ్వకుండా చేశారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ రచయితలు, అనువాదకులు బి. అనూరాధ, ఎన్. రవి దంపతుల ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.. ప్రజా సంఘాల నాయకులు, సాహిత్యకారుల కార్యకలాపాలను అడ్డుకోడానికి, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను, ప్రజా ఆచరణను నిర్బంధించడానికే ఈ దాడులని విరసం నేతలు ఆరోపిస్తున్నారు.