నేడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు.. ఆసక్తిగా చూస్తోన్న టీడీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది… ఇక, మంగళవారం పోలింగ్‌ జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వెల్లడించింది.. ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఉదయం 10 గంటల కల్లా తేలిపోనుండగా.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.. అయితే, నిన్నటి ఫలితాల్లో ఆశించినస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఫలితాలను సాధించలేకపోయింది.. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో.. ఇవాళ్టి ఫలితాల్లో తమ పరిస్థితి ఏంటి.? పార్టీకి వచ్చే ఓట్లు ఎన్ని..? దక్కే సీట్లు ఎన్ని..? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టీడీపీ శ్రేణులు.

Related Articles

Latest Articles