ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టాగా ఉన్న ఇంటి ఆస్తిని ఈ పథకంతో స్థిరాస్తిగా మారుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉపయోగపడుతుందని, అయితే, ఈపథకాన్ని టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించాలని చూస్తుందని ద్వారంపూడి విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని విమర్శించారు.
Read: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో కర్ణాటక సీఎం భేటీ… ఒమిక్రాన్ పై చర్చ…
2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు, గృహ రుణమాఫీలు చేస్తామని చంద్రబాబు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని, మరలా ఇప్పుడు అదే మోసం చేసుందుకు ప్రజల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి టీడీపీలో కొండబాబుకు టికెట్టు దక్కడం, చంద్రబాబు సీఎం కావడం రెండూ ఒక కలే అని ద్వారంపూడి విమర్శించారు.