CM Jagan Birthday: ఏపీ సీఎం జగన్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు…
జగనన్న గృహ సంకల్ప పథకాన్ని తణుకులో సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా…
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు…
ఇటీవల వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చేసిన వైసీపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత రెండు రోజులుగా ఏపీల హాట్‌టాపిక్‌గా నడిచిన ఈ విషయానికి నేడు జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తెరపడింది. విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కలిశారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. మంత్రి బాలినేని తనపై దాడి చేయించినట్లు…
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా మారింది. నేడు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా రోజా, రోజా వ్యతిరేక వర్గం పోటాపోటీగా జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిద్దమయ్యారు. నగరిలో రోజా పదివేలమందితో భారీ ర్యాలీ సిద్దం కాగా, రోజా వ్యతిరేక వర్గం పదివేలమందితో ర్యాలీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఎవరి వైపు వెళ్ళాలో అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటున్నారు. నిన్న ఫ్లెక్స్ చింపివేయడంతో రెండు వర్గాల్లో…