2013 నవంబర్ 5 వ తేదీన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మంగళ్యాన్ ఉపగ్రహాన్ని మార్స్ మీదకు ప్రయోగించింది. మార్స్ మీదకు ప్రయోగించిన ఈ ఉపగ్రహం విజయవంతంగా 2014 సెప్టెంబర్ 24 వ తేదీన మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు నెలల పాటు కక్ష్యలో పరిభ్రమించేలా మామ్‌ను డిజైన్ చేశారు. అయితే, గత ఏడేళ్లుగా మామ్ పనిచేస్తూనే ఉన్నట్టు ఇస్రో శాష్ట్రవేత్తలు చెబుతున్నారు. అక్కడి నుంచి మామ్ ఉపగ్రహం ఇప్పటికీ డేటాను పంపుతూనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపగ్రహంలో చిన్న చిన్నలోపాలు ఏర్పడ్డాయని, మరో ఏడాదిపాటు మామ్ ఉపగ్రహం పనిచేస్తుందని ఇస్రో తెలియజేసింది. సాంకేతికంగా భారత్ సత్తాను ప్రపంచానికి తెలియజేయడం కోసమే మంగళ్‌యాన్‌ను ప్రయోగించినా, అనుకున్న లక్ష్యాలు అన్నింటిని ప్రపంచానికి మంగళ్యాన్ పూర్తిచేసిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Read: గుర్రపు బండిపై అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు…