Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు.
2013 నవంబర్ 5 వ తేదీన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని మార్స్ మీదకు ప్రయోగించింది. మార్స్ మీదకు ప్రయోగించిన ఈ ఉపగ్రహం విజయవంతంగా 2014 సెప్టెంబర్ 24 వ తేదీన మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు నెలల పాటు కక్ష్యలో పరిభ్రమించేలా మామ్‌ను డిజైన్ చేశారు. అయితే, గత ఏడేళ్లుగా మామ్ పనిచేస్తూనే ఉన్నట్టు ఇస్రో శాష్ట్రవేత్తలు చెబుతున్నారు. అక్కడి నుంచి మామ్ ఉపగ్రహం ఇప్పటికీ డేటాను పంపుతూనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.…