బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అల్పపీడనం అండమాన్ దీవుల వరకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ అల్పపీడనం పశ్చి వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి డిసెంబర్ 2 వ తేదీ వరకు వాయుగుండంగా మారి డిసెంబర్ 3 వ తేదీ వరకు బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్ 4 వ తేదీన ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరమునకు చేరవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది.
Read: తాజా సర్వే రిపోర్ట్: 2022లోనూ వర్క్‌ఫ్రమ్ హోమ్…
ఈ అల్పపీడనం కారణంగా ఏపీలో రాగల మూడు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తర కోస్తా, యానంలో ఎల్లుడి నుంచి తెలియపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఇక దక్షిణ కోస్తాలో తెలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.