కేంద్ర బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే… బీజేపీ పార్టీ ఆఫీసుపై పారబోస్తామని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా? ఒక్కటే మాట సాఫ్ సీదా చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు.. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని ఆగ్రహించారు.
ధాన్యం కొనుగోలుకు విషయాన్ని అర్థం చేసుకునే ఇంకిత జ్ఞానం కేంద్రానికి లేదు.. దానికి వ్యతిరేకంగా ఇవాళ యుద్ధం మొదలైందన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేస్తున్నారు.. కొనే బాధ్యత ఎవరిది.. ఎవని మెడలు ఎవరు వంచాలని తెలిపారు. బీజేపీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు చెబుతోంది.. మా ఓపికకు ఓ హద్దు ఉంటుందని హెచ్చరించారు. మా సభలో కూడా కేంద్రం సీఐడీ ఉంటుంది.. రిపోర్ట్ తెప్పించు కోండన్నారు. మా పంట కొంటారా కొనరా చెప్పండి.. చేతులు జోడించి వేడుకుంటున్నామని పేర్కొన్నారు కేసీఆర్.