బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదని.. 2014లోనే అని కంగనా చేసిన వ్యాఖ్యలకు పలువురు కౌంటర్ ఇస్తున్నారు. కంగనా రనౌత్ స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని విమర్శకులు తప్పుబడుతున్నారు. దేశాన్ని కంగనారనౌత్ కించపరిచేలా మాట్లాడిందని.. ఆమె వద్ద నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. యువతి బట్టలు విప్పించిన యువకుడు
అయితే తనపై వస్తున్న విమర్శలను కంగనా ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా వాళ్లకు సవాల్ విసిరింది. తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని, క్షమాపణలు చెప్తానని కౌంటర్ ఇచ్చింది. తన వ్యాఖ్యలపై ఎంత దుమారం రేగినా… తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. తనతో వాదించి తన వ్యాఖ్యలు నిరూపించి మాట్లాడాలని కంగనా చెబుతోంది. కాగా తన మాటలకు మద్దతుగా ఓ పుస్తకంలోని మాటలను కంగనా కోట్ చేసింది. 1857లో మొదటి సారి స్వాతంత్ర్యం కోసం కలెక్టివ్‌గా ఫైట్ జరిగిందని… సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మిబాయ్, వీరసావర్కర్ వంటి వంటి వారిని తాను అగౌరవపరచలేదని కంగనా వివరించింది. వారందరూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారని… తనకు 1857లో జరిగిన పోరాటం గురించి తెలుసుకానీ 1947లో జరిగిన పోరాటం గురించి తెలియదని చెప్పుకొచ్చింది. అప్పట్లో బ్రిటిష వాళ్లు మనకు భిక్షగా స్వాతంత్ర్యం వేసి వెళ్లిపోయారనేది కంగనా రనౌత్ అభిప్రాయపడింది.