ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. బలం పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్రంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం విజయవంతం కావడంతో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తోందని, అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎలాంటి వలసలను ప్రోత్సహించలేదు. కాగా, ఇప్పుడు ఆ పార్టీలోకి వలసలు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఓ ఎమ్మెల్యేతో పాటుగా, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పవన్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బలోపేతం చేయాలంటే బలమైన నేతలు అవసరం ఉండటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఒకవేళ ఆ ఎమ్మెల్యే పవన్ పార్టీలో చేరితే ఆ పార్టీ ఉత్తరాంధ్రలో బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
Read: కోవాగ్జిన్‌పై ప్రపంచ ఆరోగ్యసంస్థ తుది నిర్ణయం… ఎప్పుడంటే…