ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి బులిటెన్ ప్రకారం 20 వేలకు దిగువున కేసులు నమోదవ్వగా ఈరోజు బులిటెన్ ప్రకారం కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా, దేశంలో 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,44,198 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 318 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,49,856కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 24,602 మంది కోలుకోగా, 43,08,525 మందికి టీకాలు అందించారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 92,63,68,608 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.
Read: భారత్‌లో చిన్నారులకు కరోనా టీకా… ఎప్పటి నుంచి అంటే…