భార‌త్‌లో చిన్నారుల‌కు క‌రోనా టీకా… ఎప్ప‌టి నుంచి అంటే…

భార‌త్‌లో ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  కోవాగ్జిన్‌, కోవీషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి.  18 ఏళ్లు పైబ‌డిన వారికి ప్ర‌స్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు.  కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భార‌త్ బ‌యోటెక్ సిద్ధం అవుతున్న‌ది.  ఇప్ప‌టికే చిన్నారుల కోసం త‌యారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్ర‌య‌ల్స్‌ను భార‌త్ బ‌యోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్ర‌య‌ల్స్ కు సంబంధించిన డేటాను భార‌త ఔష‌ద నియంత్ర‌ణ సంస్థ కు అంద‌జేసింది.  చిన్నారుల‌పై రెండు, మూడు ద‌శ‌ల ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేసిన‌ట్టు పేర్కొన్న‌ది.  డీసీజీఐ అనుమ‌తి ల‌భిస్తే ఇండియాలో పిల్ల‌ల‌కు టీకాలు ప్రారంభం అవుతాయ‌ని కోవాగ్జిన్ తెలియ‌జేసింది.  త్వ‌ర‌లోనే అనుమ‌తులు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ట్టు భార‌త్ బ‌యోటెక్ పేర్కొన్న‌ది.  నెల‌కు 10 కోట్ల డోసుల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టిన‌ట్టు భార‌త్ బ‌యోటెక్ తెలియ‌జేసింది.  దీనికి సంబంధించి ఇండియ‌న్ ఇమ్యూనాలాజిక‌ల్స్‌, హెస్ట‌ర్ బ‌యో సైన్సెస్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు భార‌త్ బ‌యోటెక్ సంస్థ తెలియ‌జేసింది.  

Read: బ‌ద్వేలు బీజేపీ అభ్యర్థి ఖ‌రారు…

-Advertisement-భార‌త్‌లో చిన్నారుల‌కు క‌రోనా టీకా... ఎప్ప‌టి నుంచి అంటే...

Related Articles

Latest Articles