దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అని చెప్తాం. ఆయన నికర ఆస్తుల విలువ 7,18,000 కోట్లు. ప్రతిరోజు ఆయన కుటుంబం సంపాదన రూ.163 కోట్లు పెరుగుతున్నట్టు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అయితే, దేశంలో సంపన్నుల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న ఆదాని రోజువారి ఆదాయం విషయంలో ముఖేష్ అంబాని కుటుంబాన్ని దాటేశారు. ముఖేష్ అంబాని కుటుంబానికి అందనంతగా భారీగా ఆదాయన్ని పెంచుకుంటున్నారు. గౌతమ్ ఆదానీ కుటుంబం ప్రతిరోజు సంపాదన వెయ్యికోట్లకు పైగానే ఉన్నట్టుగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ పేర్కొన్నది. ఏడాది కాలంలోనే వారి సంపాదన 261 శాతం పెరిగింది. ప్రస్తుతం ఆదానీ నికర ఆస్తుల విలువ రూ.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే విధంగా ఆయన సంపాదన పెరిగితే త్వరలోనే ముఖేష్ అంబానీని దాటేస్తారు అనడంలో సందేహం లేదు.
Read: కాంగ్రెస్‌కు జీ 23 ఎఫెక్ట్: త్వరలో ఆ నిర్ణయం తీసుకోకుంటే…