ఐసీసీ టీ20 ర్యాంకులు.. భారత్ నుంచి ఒకేఒక్కడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం నాడు ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. దీంతో అతడు 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 796 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ మూడో స్థానంలో నిలిచాడు. 735 పాయింట్లతో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగంలో శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ 797 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు షాంసీ (784 పాయింట్లు), ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా (725 పాయింట్లు), ఇంగ్లండ్ ఆటగాడు రషీద్ (719 పాయింట్లు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ (710 పాయింట్లు) టాప్-5లో స్థానం దక్కించుకున్నారు. టాప్-10లో ఒక్క టీమిండియా బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మహ్మద్ నబీ (ఆప్ఘనిస్తాన్), షకీబ్ (బంగ్లాదేశ్), లివింగ్ స్టోన్ (ఇంగ్లండ్), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), హసరంగ (శ్రీలంక) టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ టాప్-10లో భారత ఆటగాళ్లకు స్థానం దక్కలేదు.
Also Read

మరోవైపు టీమ్ ర్యాంకుల విషయానికి వస్తే ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు టాప్-10లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..