బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తోంది. కొద్దిసేపు జలకాలాడిన ఆమె కన్ను షవర్ పై పడింది. షవర్ కింద ఒక నల్లటి వస్తువు కనిపించింది. వెంటనే ఏంటా అని దాన్ని పట్టుకొని చూడగానే ఆమె వెన్నులో వణుకుపుట్టింది. అదొక చిన్న సీక్రెట్ కెమెరా అని తెలియగానే స్నానం చేయకుండానే నిలువునా తడిసిపోయింది. గత కొన్ని రోజుల క్రితం షవర్ పడడంతో ఒక పంబ్లర్ ని పిలిచిన ఘటన గుర్తుకు రావడంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన బ్రిటన్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కి చెందిన ఒక మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. 2018 లో ఆమె బాత్ రూమ్ లో షవర్ పనిచేయక పోవడంతో జేమ్స్ హుల్మ్ అనే పంబ్లర్ ని పిలిచింది. అతను వచ్చి పనిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వారి షవర్ కింద ఒక చిన్న సీక్రెట్ కెమెరాను అమర్చాడు. ఈ విషయం ఆ మహిళకు ఇటీవల తెలిసి ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు జేమ్స్ హుల్మ్ ఇంటికి వెళ్లి చూడగా.. అతడి సిస్టమ్ లో 302 బాత్ రూమ్ వీడియోలను, చిన్నారుల అశ్లీల వీడియోలను చూసి షాక్ అయ్యారు. వాటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా.. అతడికి 12 నెలల జైలు శిక్షను విధించారు.