భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.

Read Also:
మరోవైపు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. బేస్ రేట్‌ను 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేటు ప్రకారం 2021 డిసెంబర్ 15 నుంచి వార్షికంగా 7.55 శాతం వడ్డీ ఇస్తామని ఎస్‌బీఐ తెలిపింది. అయితే ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్లకు పైగా చేసే డిపాజిట్లపైనే వర్తిస్తుందని వెల్లడించింది.