భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.…