గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ నగరంలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.48,110కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. కిలో వెండి ధర రూ.500 తగ్గి 69,100 కి చేరింది. అంతర్జాతీయంగా పుత్తడి ధరలు తగ్గడంతో పాటుగా, కరోనా నుంచి కోలుకొని మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయంగా పుత్తడి ధరలు దిగివస్తున్నాయి.
Read: మూడో రోజు వినోదం తక్కువ… విషాదం ఎక్కువ!