దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెరిగింది. రాయితీ, రాయితేతర గ్యాస్ సిలిండర్ పై రూ.15 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు మరోసారి గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులుపై మరింత భారం పడే అవకాశం ఉన్నది. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కేజీల వంటగ్యాస్ ధర రూ.899.50 కి చేరింది. గత రెండు నెలల కాలంలో నాలుగు సార్లు వంటగ్యాస్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. 2021లో ఇప్పటి వరకు వంటగ్యాస్ ధర రూ.205 పెరిగింది. ఢిల్లీలో వంటగ్యాస్ ధర రూ.899.50, ముంబైలో రూ.889.50, కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.50, హైదరాబాద్‌లో రూ.925 గా ఉంది.
Read: లఖింపూర్ ఘటన: రాహుల్ కు అనుమతి నిరాకరణ…