ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌: రాహుల్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌…

ల‌ఖింపూర్ ఘ‌ట‌నపై ఇంకా నిర‌స‌న‌లు కొనసాగుతూనే ఉన్నాయి.  ల‌ఖింపూర్ లో కేంద్ర స‌హాయమంత్రి అయ‌జ్ మిశ్రా కుమారుడు నిర్లక్ష్యం కార‌ణంగా న‌లుగురు రైతులు మృతి చెందారు.  ఆగ్ర‌హించిన రైతులు కారును ధ్వంసం చేశారు.  ఈ ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగురు మృతి చెందారు.  ఈ ఘ‌ట‌నపై ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర‌మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి.  ల‌ఖింపూర్‌లోని బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఎవ‌ర్నీ పోలీసులు అనుమ‌తించ‌డం లేదు.  గ‌త రెండు రోజులుగా ప్రియాంక గాంధీ గృహ‌నిర్భంధంలోనే ఉన్నారు.  కాంగ్రెస్ నేత‌ల‌ను ఇప్ప‌టికే పోలీసులు అడ్డుకున్నారు.  కాగా, ఈరోజు రాహుల్ గాంధీ ల‌ఖింపూర్ వెళ్లేందుకు పోలీసుల అనుమ‌తిని కోరారు.  కానీ, పోలీసులు అనుమ‌తులు నిరాక‌రించ‌డంతో కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న చేస్తున్నారు. 

Read: జ‌న‌సేన‌లోకి వ‌ల‌స‌లు ప్రారంభం కానున్నాయా?

-Advertisement-ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌:  రాహుల్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌...

Related Articles

Latest Articles