Kejriwal: ఫేక్ డిగ్రీపై తగ్గేదేలే.. మరోసారి మోడీని టార్గెట్ చేసిన ఢిల్లీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
Also Read:Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన మస్కిటో లిక్విడ్
Also Read
కొంతమంది విద్యార్థులు చదువులో పేదలైతే వారికి అదనపు తరగతులు నిర్వహిస్తాం అని సీఎం అన్నారు. వారిలో ఒకరు భవిష్యత్తులో భారత ప్రధాని అవుతారు అని చెప్పారు. ఫేక్ డిగ్రీతో ఎవరైనా ప్రధాని కావాలని మేం కోరుకోవడం లేదు అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. దేశ రాజధానిలోని విద్యా రంగంలో ఆప్ ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రశ్నించిన బిజెపి నాయకుడు హరీష్ ఖురానాకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మార్కుషీట్లను ఖురానా ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందన వచ్చింది.
Also Read:Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ తన విద్యార్హతలపై ప్రధానిపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. తన ఇటీవల అస్సాం పర్యటనలో కేజ్రీవాల్ పీఎం మోడీ యొక్క అర్హతలను ప్రశ్నించారు. ప్రధాని మోడీ చదువుకుని ఉంటే, అతను నోట్ల రద్దుకు పిలుపునిచ్చేవాడు కాదని అన్నారు. చివరికి రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలను కూడా తీసుకురాడు అని అన్నారు.
ప్రధాని మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన వివరాలను ఆప్ అధినేతకు అందించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వును రద్దు చేసిన తర్వాత గుజరాత్ హైకోర్టు మార్చి 31న కేజ్రీవాల్‌కు రూ.25,000 జరిమానా విధించింది. అప్పటి నుంచి ఈ విషయమై ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!