హైదరాబాద్‌లోని చందానగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర వయసున్న బాలుడు మృతి చెందాడు. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న బాలుడు జాకీర్ ఉన్నాడు. శనివారం రోజున చిన్నారి ఇంట్లోనే సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మస్కిటో లిక్విడ్ తాగేశాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆడుకున్న తమ కొడుకు.. ఇలా విగతజీవిగా మారిపోవటం జీర్ణించుకోలేకపోయారు.