Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇవాళ (ఆగస్టు 5న) మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హస్పటల్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాసి విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Satya Pal Malik: సుమారు రూ. 2200 కోట్ల విలువైన కిరు జల విద్యుత్ ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల మంజూరుకు సంబంధించి అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కి ఉచ్చు బిగిస్తోంది. సీబీఐ ఆయనపై గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కిష్ట్వార్‌లో కిరు జల విద్యుత్ ప్రాజెక్టు టెంటర్ల ప్రక్రియకలో జరిగిన అనుమానిత అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు.
అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నుంచి సమన్లు అందిన మరుసటి రోజు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం ఢిల్లీలోని ఆర్కే పురంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. బస్సులో ఉన్న నాయకులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతికి పాల్పడిందనే ఆరోపణల కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు పిలిచింది.
CBI questions former J&K Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఆయనను ప్రశ్నించింది. కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ.300 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏప్రిల్ నెలలో సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. మేఘాలయ గవర్నర్ గా ఉన్న ఆయన పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసిన…