నిన్నటి రోజుజ చంద్రబాబుపైన, కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ప్రెస్ మీట్ అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్ణకరం అని, అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లుగాని, ఆయన శ్రీమతి పేరుగాని ఎవరూ ప్రస్తావించలేదని, అయినా దూషించారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పేర్నినాని తెలిపారు.
Read: లైవ్: పేర్నినాని ప్రెస్ మీట్…
కుటుంబ పరువును పణంగా పెట్టి మెలో డ్రామా క్రియేట్ చేయడం బాధాకరం అని, చంద్రబాబు సతీమణిని ఎవరేమన్నారని ఆయన ప్రశ్నించారు. ఇవతల ఉన్నవాళ్లు సంస్కారం లేనివాళ్లు అనుకుంటున్నారా మీరు అని ప్రశ్నించారు. వ్యవస్థల్ని, రాజకీయాల్ని ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రశ్నించారు పేర్నినాని.