కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ.. నీటి మళ్లింపునకు అనుమతి ఇవ్వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్‌ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి మళ్లించకపోతే పులిచింతల, ప్రకాశం బ్యారేజి ఫోర్ షోర్ లో, దిగువన పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.. ఈ పరిస్థితుల్లో ఎగువనే వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇది కేవలం వరద జలాల మళ్లింపు మాత్రమేనని లేఖలో పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. ఈ మళ్లింపును ఏ రకంగాను ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వాటాలో భాగంగా పరిగణనలోకి తీసుకోకూడదన్న ఆయన.. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుమతి అడిగిన ఆంధ్రప్రదేశ్ వరద నీటిని మళ్లించకపోతే దిగువన ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.. రాష్ట్ర విభజన చట్టం 85 (7) ఈ పేరా 6 ప్రకారం ప్రకృతి విపత్తులను నిర్వహణలో ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలని, ఇందుకు బోర్డులు సలహాలు, సూచనలు అందిస్తాయని పేర్కొంటోందని పేర్కొన్న ఆయన.. ఈ విషయంలో బోర్డులకు తమ ఆదేశాలు అమలు చేసేలా విస్తృత అధికారాలు ఉన్నాయన్నారు.. వరదల సమయంలో నీటి విడుదల, డ్యాంలు, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణ విషయంలో బోర్డుల ఆదేశాలను రెండు రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా నదిలో మిగులు జలాలను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు అనుమతించాలని మరోసారి కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు ఏపీ ఈఎన్సీ.. జాతీయ ప్రయోజనాలకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా ఆ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా వృథా అవుతుందన్న ఆయన.. ప్రస్తుతం కృష్ణానదిపై జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు.. గడిచిన రెండు సంవత్సరాల్లో ఇలాంటి సందర్భాలే ఎదురైన సమయంలో ఎగువన వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించామని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఆయా చోట్ల తాగు, సాగు నీటి అవసరం ఉందో లేదో అన్న విషయంతో సంబంధం లేకుండానే చేశామని లేఖలో పేర్కొన్నారు నారాయణరెడ్డి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..