గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలో జరిగింది. గాలిలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం దారి మళ్లించారు. పక్షిని ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే… అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం ఓహియో విమానాశ్రయంలో పక్షిని ఢీకొట్టిన తర్వాత దాని ఇంజిన్ గాలిలో మంటలు వ్యాపించడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Also Read:Ys Sunitha Reddy Petition Live: సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
ఆదివారం విమానం బోయింగ్ 737 కమర్షియల్ జెట్ ఉదయం 7:45 గంటలకు టేకాఫ్ తర్వాత 30 నిమిషాల తర్వాత విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఫీనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అప్పర్ ఆర్లింగ్టన్ మీదుగా ఎగురుతున్న విమానం పక్షిని ఢీకొట్టిన తర్వాత దారి మళ్లించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత విమానం జాన్ గ్లెన్ కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7
— CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023