Kim Kardashian: రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ‘అమెరికన్ హారర్ స్టోరీ’ అనే షోలో కనిపించనుంది. అందులో వింతేముంది? అది ఆమె జాబ్! కిమ్ రియాలిటీ స్టార్ గానే కాదు, నటిగానూ, వ్యాపారరంగంలోనూ ఎంతో పేరున్న బిలియనీర్. అందువల్ల కిమ్ కర్దాషియన్ ఏమి చేసినా అది వార్తగా మారిపోతోంది. ఇక సోషల్ మీడియాలోనూ కిమ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు 352 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో కిమ్ ఏది పోస్ట్ చేసినా, దానికి నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇంత సెలబ్రిటీ కాబట్టే కిమ్ ‘అమెరికన్ హారర్ స్టోరీ’ షోలో కనిపించబోవడం విశేషంగా మారింది.
తన ఒంపుసొంపుల ప్రదర్శనతో కుర్రకారుకు మత్తెక్కిస్తూ వస్తోన్న కిమ్ బిలియనీర్స్ ఫ్యామిలీకి చెందినా, ‘అందం ఉన్నది ఎందుకు చూపేందుకు…’ అంటూ సాగింది. ఆమె శృంగారం ఒలకబోసిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లోనూ తనదైన బాణీ పలికించింది. అప్పటి నుంచీ కిమ్ డేర్ నెస్ కు, ఆమె అందచందాలకు అభిమానులుగా మారారు ఎందరో! చిత్రమేమిటంటే, ఆమెను ఆరాధించేవారిలో మగాళ్ళతో పాటు ఆడవాళ్ళూ ఉన్నారు. అమెరికన్ ర్యాపర్-సింగర్ కేన్ వెస్ట్ తో ఎనిమిదేళ్ళు కాపురం చేసిన కిమ్ గత సంవత్సరమే విడాకులు తీసుకుంది. అప్పట్లో అంతగా నటించని కిమ్ విడాకుల తరువాత కనిపిస్తోన్న ‘అమెరికన్ హారర్ స్టోరీ’ కూడా జనాన్ని అలరిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇందులో కిమ్ పాత్ర విలక్షణంగా ఉంటుందట! భలేగా భయపెడుతుందనీ వినిపిస్తోంది. అందాలభామ భయపెట్టినా అందమేగా!