ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటా.. తప్పుడు కేసులు పెట్టడం వల్ల భయపడిపోతాం అనేది మీ…
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు…
ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే... అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.
సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్ లో పోస్ట్ పెట్టడంతోనే నా పైనా కేసు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 54 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఇక, మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు దోచుకుంటున్నాడు అని మాజీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.. పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? అంటూ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి మరి ఈవీఎంలు ధ్వంసం చెపించాడు.. తాలిబన్ ముఠాలాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్‌లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
Chandrababu: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు షో నిర్వహించి, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేయగా.. సెక్ష న్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేశారు బిక్కవోలు పోలీసులు..…