పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్‌లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ…
విశాఖ టిడిపి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు తెలుగు ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా కష్టాన్ని, శ్రమను నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని.. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడని పేర్కొన్నారు. ఆయన చేయని పదవులు లేవని.. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ఎంతో మంది ప్రధానులను, ప్రెసిడెంట్ లను నిర్ణయించిన వ్యక్తి అని.. మళ్లీ చంద్రబాబు సీఎం…