ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతాం
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మె్ల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరుగనన్నది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు. వంశీ అరెస్ట్ కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఇక, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు అని ఏపీ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చు.. అయినా ఈ 8 నెలల్లో వైసీపీ నేతలు ఎన్నిసార్లు కలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ.. తాజా పరిణామాలపై కీలక చర్చ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల దెందులూరులో చోటు చేసుకున్న ఘటనలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు చింతమనేని.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ వంశీ లోనికి వెళ్ళాడు, రేపు కొడాలి నాని వెళ్తాడు, ఎల్లుండి మరో నేత వెళ్తాడు అని పేర్కొన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయి.. వారి సంగతి ఎప్పుడు అని ప్రజలు కోరుతున్నారు.. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. వంశీ ఏ తప్పూ చేయకుండానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం అయిందా అని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.
పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతాం
దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాలను ఏపీ డిప్యూటీ సీఎం పనవ్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ రోజు రోప్ వే ద్వారా పళని అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి ఆలయానికి డిప్యుటీ సీఎం పవన్, ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి చేరుకున్నారు. పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగ థాయ్-పూస.. థాయ్ పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్థాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియ చేస్తా.. క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు.
మోడీ-ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు.. హుందాగా ఉందని కితాబు
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌తో మోడీ చర్చలు భారత్‌కు ప్రోత్సాహకరంగా.. ఆందోళనలు పరిష్కరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌తో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మోడీ హుందాగా నడుచుకున్నారని కితాబు ఇచ్చారు. ఇక అమెరికా నుంచి పంపించేస్తున్న భారతీయుల పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఈ సమావేశం దేశం ఎదురు చూస్తున్న అనేక సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాలపై మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
మంగళవారం ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ.. కొత్త సీఈసీ ఎంపిక ఎప్పుడంటే..!
భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే పదవీ విరమణ తర్వాత కొన్ని నెలల పాటు హిమాలయాల్లోనే గడుపుతానని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే వచ్చే సోమవారం కొత్త సీఈసీ ఎంపిక చేసే కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త భారత ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేయనున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అనంతరం వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. త్వరలోనే కొత్త సీఈసీని ప్రకటించబోతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ట్రంప్ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. తాజాగా ప్రధాని మోడీ పర్యటన తర్వాత కూడా ట్రంప్ ఆలోచనలో మార్పు కనిపించలేదు. టారిఫ్‌లు తగ్గించే ప్రసక్తేలేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా సూచీలు రెడ్‌లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 75, 939 దగ్గర ముగియగా.. నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 22, 929 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.83 దగ్గర ముగిసింది.
అందుకే బాలీవుడ్ విఫలం అవుతుంది..‘మీర్జాపూర్’ నటుడు సంచలన వ్యాఖ్యలు
యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ఎంతో కీలకమైన కలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించారు. బాలివుడ్‌లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పంకజ్ దగ్గరయ్యారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పంకజ్ త్రిపాఠీ బాలివుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంకజ్ త్రిపాఠి తన బాల్యం, బీహార్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి సినిమా వరకు తన ప్రయాణం వంటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ప్రేక్షకులు బాలీవుడ్‌తో కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణాన్ని వివరించారు. ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోయే కథలను తెరకెక్కించడంలో బాలీవుడ్ విఫలమైందన్నారు.