టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై హైకోర్టు విస్మయం
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వార్తల్లో నిలిచారు.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇకపై వాయిదాలు వేయలేని న్యాయస్థానం స్పష్టం చేసింది.. అయితే, దగ్గుబాటి ప్రసాద్ ఎంపీపీగా ఉన్న సమయంలో హత్య కేసులో నిందితుడిగా కేసు నమోదు అయ్యింది.. అయితే, ఈ కేసులో స్టే ఇవ్వాలని దగ్గుబాటి ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. అసలు, పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం..
రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు.. ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది..!
రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్నారు రైతులు.. దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు మద్దతు ధర ఇచ్చామని గుర్తుచేశారు.. గ్రేడ్ బాగున్నా రూ. 600 మాత్రమే క్వింటా అమ్ముతున్నారు… రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదని వాపోయారు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డ ఆయన.. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి.. కానీ, ఈ ప్రభుత్వానికి కమిషన్ రాదని బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.. ఇక, ఏ పంట వేసుకున్న రైతుకు గిట్టుబాటు ధర లేదన్నారు వైఎస్ జగన్.. అన్నదాత సుఖీభవకు రూ.20,000… రూ. 20,000.. రూ. 40,000 ఇస్తామన్నారు.. ఇంతవరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.. ప్రభుత్వమే రైతులు వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.. కానీ, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్..
ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై సీఎం సమీక్ష.. కీలక సూచనలు
ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె. విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఎరువుల లభ్యత, సరఫరా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు.. అయితే, ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఈ సారి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని సీఎంకు తెలిపారు అధికారులు.. అయితే, ఈ క్రాప్ ద్వారా ఎంత సాగు అవుతుంది.. ఎంత వినియోగం జరుగుతోంది అనేది లెక్కించాలని పేర్కొన్నారు సీఎం.. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు.. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని.. వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా.. నష్టపరిహారం చెల్లించి అయినా.. తెగులు వచ్చిన పంటను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ప్రమాదం జరిగిన తర్వాత ఎక్స్ గ్రేషియా సమాధానం కాదు.. ప్రమాదాల నివారణే టార్గెట్..!
జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్నారు.. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.. మానవ తప్పిదాలు, నిర్వహణ లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. అయితే, ఏఐ ద్వారా ప్రమాదాలను తగ్గించే దిశగా కసరత్తులు చేయాలని.. ప్రతీ ఏడాదికి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు, ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని కోరారు.. ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ప్రమాదాల నివారణకు డిస్కంలకు సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించారు మంత్రి గొట్టిపాటి.. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించడంతో పూర్తి స్థాయి ప్రమాదాల నివారణ సాధ్యం అవుతుందన్నారు.. విద్యుత్ ప్రమాదాల నివారణకు పక్క రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలి సూచించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట!
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యంతర పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ (ఏజీ) తీసుకెళ్లారు. కేసును తెలంగాణ సర్కార్ సీబీఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ కేసీఆర్, హరీష్ రావుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అదే!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్ సహా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ‘రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి పౌరుడు రాజశేఖరరెడ్డిని చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారు. రైతే ద్యేయంగా పాలన చేసినటువంటి గొప్ప వ్యక్తిఆ ఆయన. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్‌ను గుర్తుంచుకుంటారు’ అని చెప్పారు. కేవీపీ రామచంద్రరావు, దానం నాగేందర్ మహానేత వైఎస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.
సెమికాన్ ఇండియాలో.. తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్‌సెట్‌ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొన్నారు. మోడీ విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించారు. సెమీకండక్టర్ చిప్ ఒక సిలికాన్ సర్క్యూట్ బోర్డ్ లాంటిది. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్‌కి.. మానవునికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. సెమీకండక్టర్ చిప్ డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్‌లతో సహా అనేక విధులను నిర్వహిస్తుంది.అలాగే, సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత, ఈ సంవత్సరం నుంచి భారతదేశం తన మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌సెట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ప్రధాని చెప్పారు.
ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్‌లపై మోడీ ధ్వజం
ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్ 2025 సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. జూన్ త్రైమాసికంలో భారతదేశం బలమైన ఆర్థిక పనితీరును కనబరించిందని ప్రశంసించారు. ఆర్థిక స్వార్థం ద్వారా నడిచే సవాళ్లను దేశం ఎలా ఎదుర్కొందో ఇదే చక్కని ఉదాహరణ అన్నారు. భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందన్నారు. ఇక భారతదేశంలో సెమీకండక్టర్ భవిష్యత్తును నిర్మించడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉందనే స్పష్టమైన సందేశాన్ని సెమికాన్ ఈవెంట్ పంపిందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ అభిృద్ధి చెందుతోందని.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్ ఇండియా కోసం భారత్‌కు రావాలని.. ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ దేశాలు చెప్పుకొనే రోజు త్వరలోనే రానుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీ పెరిగినా భారత్‌కు ఆదరణ తగ్గలేదన్నారు.
ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐ నుంచి రూ. కోటి పొందే ఛాన్స్..
భారతీయ రైల్వేలలో పనిచేస్తున్న దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు, 15 లక్షల మంది పెన్షనర్లకు ఒక శుభవార్త . దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో రైల్వే మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది. ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం (MoU)కుదిరింది. ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను అందించడానికి ఈ ఒప్పందం జరిగింది. నిన్న సాయంత్రం రైల్ భవన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్, SBI చైర్మన్ CS సెట్టి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. స్టేట్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న రైల్వే ఉద్యోగులకు మునుపటి కంటే ఎక్కువ బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రయోజనం ఏమిటంటే, ఉద్యోగి విమాన ప్రమాదంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ.1.6 కోట్ల బీమా ప్రయోజనం లభిస్తుంది. దీనితో పాటు, వారి RuPay డెబిట్ కార్డ్ ద్వారా రూ.1 కోటి వరకు అదనపు కవరేజీ కూడా అందుబాటులో ఉంటుంది.
తండ్రిపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లు ఉన్నాయి. హరికృష్ణ 2018లో యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి ఏటా హరికృష్ణ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ లోనే బిజీగా ఉంటున్నాడు. ఆ మూవీపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన వార్-2 ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మూవీ తర్వాత మల్టీస్టారర్ సినిమాలో నటించకూడదని జూనియర్ ఎన్టీఆర్ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఎన్టీఆర్.
మంచు మనోజ్ ని అభినందించిన రజనీకాంత్
తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. ‘మిరాయ్’ మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘మిరాయ్’ సినిమాతో మనోజ్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ మూవీ ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్ కల్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. కారు మీద కూర్చుని గ్లాసెస్ పెట్టుకుని మాస్ అండ్ స్టైల్ కలబోసిన లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఫుల్ మాసివ్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ హల్ చల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో వస్తోంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.