వరస వివాదాల్లో బీబీసీ.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి 2002 గుజరాత్ అల్లర్లలో లింకు పెడుతూ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారత్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు వివాదాల్లో చిక్కుకుంది. ప్రముఖ పర్యావరణవేత్త సర్ డేవిడ్ అటెన్ బరో వ్యాఖ్యానంతో కొనసాగే వన్యప్రాణులపై సీరీస్ ఎపిసోడ్ ను నిలివేశారని ఆరోపణ ఎదుర్కొంటోంది. ప్రముఖ ఫుడ్ బాల్ క్రీడాకారుడు, బీబీసీ స్పోర్ట్స్ యాంకర్ గ్యారీ లినేకర్ ని తప్పించడం మరోటి. ఈ రెండింటితో బీబీసీ అసాబుపాలు అయింది. గ్యారీ లినేకర్ విషయంలో బీబీసీ ఉద్యోగులు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. డేవిడ్ అటెన్ బరో వ్యాఖ్యానంతో ప్రసారం అవుతున్న ‘వైల్డ్ లవ్’ ప్రోగ్రామ్ 6వ ఎపిసోడ్ ను కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆపేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే దీన్ని బీబీసీ ఖండించింది. ఇందులో ఐదు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాము పర్యావరణ అంశాలపై వెనకడుగు వేయమని చెప్పింది. ఇదిలా ఉంటే బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు వలస కార్మికులపై ఉపయోగిస్తున్న భాష, జర్మనీ నాజీలను తలపించేలా ఉందని బీబీసీ స్పోర్ట్స్ యాంకర్ గ్యారీ లినేకర్ ట్వీట్ చేయడంపై బీబీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు బీబీసీ నిష్పక్షపాత వైఖరికి భంగం కలిగించాయంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఘటనలో అనూహ్యంగా బీబీసీ ఉద్యోగులు గ్యారీకి మద్దతుగా నిలిచారు. విధులను బాయ్‌కాట్ చేశారు.
పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేయగా.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్ అదే విధంగా కౌంటర్ ఇచ్చారు. అసలు మ్యాటర్‌లోకి వస్తే.. మిలియన్ మార్చ్ గుర్తు చేస్తూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. మిలియన్ మార్చ్ కు సుభిక్ష కాలం గడిచిందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు మిలియన్ మార్చ్ కు బాధ్యులైన నాయకులు, ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించలేదన్నారు.ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆశయాలను నీరుగార్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఇక కిషన్ రెడ్డి ట్వీట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చి తెలంగాణా పుట్టిందని ఎన్నోసార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పుతో కొట్టుకునే బీజేపీ సన్యాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కావడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.6 లక్షల కోట్లకు పైమాటే
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలి ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 17న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.6 లక్షల కోట్లకుపైగా ఉండనుందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి పద్దు ఇదే కానుంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ పద్దుకే పరిమితం అవుతుంది. ఈ నెల 25 లేదా 27వ తేదీతో ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఆమోదం తెలపనుంది. బడ్జెట్లో సంక్షేమంతోపాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. అందరి దృష్టి నిధుల కేటాయింపుపైనే ఉంది. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి కేటాయింపులు భారీగానే ఉంటాయని సమాచారం. గత ఏడాది బడ్జెట్ లో మొత్తం 2 లక్షల 56 వేల 256 కోట్ల రూపాయలతో అంచనాలను బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. ఈ సారి సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. సంక్షేమానికి మరింతగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖే నుంచే పాలన కొనసాగిస్తామని విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా మరోసారి సీఎం జగన్ ప్రకటించారు. అతి త్వరలో విశాఖకు తాను ఫిఫ్ట్ అవుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాలనలో మూడు రాజధానులు, సంక్షేమం, విశాఖ గ్లోబల్ సమిట్ వంటి ముఖ్యమైన విషయాలపై జగన్ మాట్లాడే అవకాశం ఉంది.
మరోసారి ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా సంస్థల చైర్మన్ గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటారు. ఇన్స్‌పిరేషనల్, మోటివేషనల్, ఫన్నీ ట్వీట్లు చేస్తుంటారు. నెటిజెన్లు చేసే పలు ట్వీట్లకు కూడా స్పందిస్తుంటారు. అందుకే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ హ్యాండిల్ కు 10.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. భారతదేశంలోని నదుల ప్రాముఖ్యత, నీటి సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారతదేశంలోని 51 నదుల పేర్లలో ఉన్న వీడియో సాంగ్ ను షేర్ చేశారు. ‘‘రివర్స్ ఆఫ్ ఇండియా’’ సాంగ్ ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘భారతదేశంలోని 51 నదుల పేర్లపై ఆధారపడిన అద్భుతమైన పాట. ఈ విలువైన వనరుపై అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. బాంబే జయశ్రీ ( ఆమె కుమారుడు అమృత్) కౌశికి చక్రవర్తి ఆమె కుమారుడు, రిషిత్) మరియు అనేక ఇతర వ్యక్తులతో కలిసి రూపొందించారు. సంగీతాన్ని నదిలా ప్రవహించనివ్వండి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడం’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
దొంగ ఓట్ల రాజ్యం.. ఉద్యోగులకు జీతాలివ్వరు గానీ
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేయలేదని ఆయన గుర్తుచేశారు. వైయస్, చంద్రబాబు కూడా అభ్యర్థులను నిలపలేదన్నారు. జగన్ అభ్యర్థులను నిలపడమే కాకుండా అక్రమ మార్గాల్లో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చారని చెప్పారు. 15 వేల ఓట్లు తిరుపతిలోనే ఎక్కించారని తెలిపారు. ఎక్కడ దొంగ ఓట్లు వేసినా వారిని పాట్టిస్తామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో వెండి బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఓటుకు 5 నుంచి 10వే లు ఇస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు.. ఓటుకు మాత్రం డబ్బు ఇస్తారని ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలను జగన్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలసి పని చేస్తున్నామన్నారు. పరస్పరం ఓటు బదిలీ జరిగేలా చూస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి రిహార్సల్స్ అని అందుకే జగన్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈసారి వైసీపీ గెలిస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి మెడకు వారే ఉరి వేసుకున్నట్టే అని వ్యాఖ్యానించారు.
అసలు ఊహించని కాంబినేషన్ ఇది
Kollywood
కొన్ని కాంబినేషన్ అవుట్ ఆఫ్ ది బ్లూ అనౌన్స్ అయ్యి అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే… “శింబు, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా”. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మార్చ్ 30న పత్తు తల సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిన శింబుతో లోకనాయకుడు కమల్ హాసన్ ఒక సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ‘ఎస్‌టీఆర్ 48’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ ప్రొడ్యూస్ చేస్తుండగా ‘దేశింగ్ పెరియసామి’ డైరెక్ట్ చేస్తున్నాడు. శింబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు 100కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నారని సమాచారం. ఊహించని ఈ అనౌన్స్మెంట్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. విక్రమ్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన కమల హాసన్, తన బ్యానర్ లో ఇతర హీరోల సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి చాలా రోజులు అయ్యింది. ఇందులో భాగంగానే శింబుతో ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
పర్యాటకుల్ని మోసిన ఏనుగు..ఏడిపిస్తున్న పిక్
జనరల్ గా ఏనుగు అనగానే భారీ ఆకారంలో బలంగా కనిపిస్తుంది. కానీ, తన జీవితకాలమంతా పర్యాటకులను మోసి మోసి కృశించుకుపోయిన ఓ ఏనుగు దయనీయ పరిస్థితి మూగజీవుల పట్ల మనుషుల అమానవీయ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఏళ్ల తరబడి ఎంతో మందిని మోసిన ఆ ఏనుగు ఇప్పుడు నిర్వకారంగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బక్కచిక్కపోయిన ఈ ఏనుగు ఫొటోను చూసి నెటిజన్స్ విభిన్న రితీలో కామెంట్స్ చేస్తున్నారు. థాయ్ లాండ్ కు చెందిన లిన్ అనే ఆడ ఏనుగు(71) 25 ఏళ్లుగా పర్యాటకశాఖలో సేవలు అందించింది. ట్రెక్కింగ్ విభాగంలో పని చేసిన ఈ ఏనుగు.. దశాబ్దాలుగా పర్యాటకులను మోయడంతో నిర్వికారంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ ఏనుగుపై ఆరుగుర్ని ఒకేసారి ఎక్కించి తిప్పేవారు. పర్యాటకులను మోసి మోసి బక్క చిక్కిపోయిన ఈ గజరాజు ఫొటోను వైల్డ్ లైఫ్ ఫెండ్రస్ ఫౌండెషన్ ఇన్ థాయ్ లాండ్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ.. ఏనుగుల దయనీయ పరిస్థితిని వివరించింది.
ఈ లక్షణాలుంటే మీ రోగనిరోధక వ్యవస్థ
రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి.. వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిందని సూచించే కొన్ని లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. మనం కొన్నిసార్లు తక్కువగా లేదా అతిగా చురుకుగా ఉంటాం. ఇది తరచుగా మన శరీరాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది. దీనిని ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. ఈ లక్షణాలను గుర్తించగలిగితే చికిత్స చేయడం సులభం. కాబట్టి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..
పొడి కళ్లు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ప్రధాన లక్షణం పొడి కళ్లు. మీ కళ్లలోకి ఇసుక చేరి అస్పష్టమైన దృష్టిని అందించినట్లు అనగా కళ్లల్లో మంట, దురదగా అనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మరొక లక్షణం డిప్రెషన్. ఈ స్థితిలో మన రోగనిరోధక వ్యవస్థ మెదడుకు తాపజనక కణాలను పంపుతుంది. ఈ కణాలు సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలను అనుమతించవు. ఇది మనల్ని డిప్రెషన్‌కు గురి చేస్తుంది.చర్మంపై దద్దుర్లు, తామర వంటి పరిస్థితులతో బాధపడుతుంటే అది కూడా రోగనిరోధక వ్యాధికి సంకేతం కావచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ అతిగా క్రియాశీలకంగా మారినప్పుడు ఇది జరుగుతుంది. ఈ స్థితిలో సోరియాసిస్ కూడా అభివృద్ధి చెందుతుంది.
త్వరలో మార్కెట్లోకి మోటరోలా 5జీ ఫోన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోనో కంపెనీ అయిన మోటోరోలా తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో.. అదిరిపోయూ ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ అట్రాక్టివ్ డిజైన్ తో పాటు ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జీబీ ర్యామ్, డ్యూయల్ రేర్ కెమెరా వంటి గొప్ప ఫీచర్లెన్నో ఇందులో ఉన్నాయి. దీని ధర కేవలం 20 వేల రూపాయలలోపు ఉండటం విశేషం. టో జీ73 మోడల్ పేరిట రిలీజవుతున్న ఈఫోన్లో ప్రస్తుతానికి ఒక వేరియంటు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్ ( ఆక్టాకోర్ కోర్ 2.2GHz ), 50MP+8MP రియల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.5 LCD ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉన్నాయి. ఇన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర భారత్ లో రూ. 18,999కు లభించనుంది. సంబంధిత బ్యాంక్ కార్డులను వాడితే రూ.2 వేల వరకు తగ్గే అవకాశం ఉందని మోటోరోలా కంపెనీ ప్రకటించింది. అంటే ఈ మొబైల్ రూ. 16,999 ధరకే పొందే అవకాశం ఉందని తెలిపింది.