Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Headlines Ntv Top Headlines January 23 2023 At 9pm

Top Headlines @9PM: టాప్ న్యూస్

Published Date :January 23, 2023 , 9:06 pm
By GSN Raju
Top Headlines @9PM: టాప్ న్యూస్

నేను రాజీనామా చేస్తా…మహారాష్ట్ర గవర్నర్ ప్రకటన

Maharashtra Governor

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని ఉందంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తాను రాజీనాయ చేయబోతున్నట్లు ముంబయికి వచ్చిన ప్రధానికి తెలియజేశానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తన శేష జీవితం అంతా రాయడం చదవడంతో పాటు ఇతర కార్యకలాపాలతో గడపాలనేదే తన కోరిక అంటూ వెల్లడించారు. మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి సేవలందించడం ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ప్రకటనను విడుదల చేశారు. దీంతో 80 ఏళ్ల కోశ్యారీ తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భగత్ సింగ్ కోశ్యారీ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెల్లవారు జామునే ప్రమాణస్వీకారం చేయించడం, ఇటీవల కూడా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. గతంలో మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించి వార్తల్లో నిలిచారు.

చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

New Project (19)

అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి. ఈ కాల్పులలో సాయిచరణ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో సాయి చరణ్ ని హుటాహుటిన చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సాయిచరణ్ తల్లిదండ్రులు బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయిచరణ్ స్నేహితులు జరిగిన ఘటనని అతని తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. చికాగోలో నల్ల జాతీయుల కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి సాయిచరణ్ గాయపడడం వారి కుటుంబాన్ని షాక్ కు గురిచేసింది. సాయి చరణ్ త్వరగా కోలుకుని స్వదేశానికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీకి ప్లాట్ నెంబర్(248) చెందిన శ్రీనివాసరావు లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సాయి చరణ్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో విద్యని అభ్యసిస్తున్నాడు.. కాగా ఈరోజు ఉదయం చికాగోలో సాయిచరణ్ నల్ల జాతీయుల కాల్పుల్లో గాయపడ్డాడు.

తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్.. 2.73శాతం డీఏ పెంపు

New Project (21)

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది.2.73శాతం డీఏ పెంపు ప్రకటించింది ప్రభుత్వం. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ పూర్తవుతుంది. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయనున్నారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లోపు అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు విద్యాశాఖ తాజా షెడ్యూల్‌లో పేర్కొంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతులకు అనుమతి ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ చేపట్టడం విశేషం. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరదించినట్లైంది.

బేగంపేటలో భారీగా నగదు స్వాధీనం

Cash

బేగంపేట పోలీస్టేషన్ పరిధిలో భారీగా నగదు ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింద ఓక కారులోంచి మరో కారులోకి నగదు ను మారుస్తుండగా..అనుమానం కలిగిన పోలీసులు వివరాలు అడగడంతో వారు పోంతన లేని సమాధానం చెప్పారు..వెంటనే రెండు కార్లో తో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీస్టేషన్ తరలించి విచారిస్తున్నారు పోలీసులు..రుతు ప్రియ ఇన్ ఫ్రా స్ట్రచర్స్ కు చేందిన డబ్బుగా వెంకటేశ్వర్లు,ప్రశాంత్,రిషబౌ చౌదరి పోలీసుల కు తెలియజేయగా.డబ్బుకు సంబందించిన లావదేవీలు రసీదు చుపలాని..లేని పక్షంలొ ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అప్పజేప్పుతమాని పోలీసులు వారికి సూచించారు..సుమాను నాలుగు కోట్ల రుపాయల వరకు ఉంటుందని అంచనా..మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్విట్టర్లో సునీల్ కుమార్ ఆసక్తికరవ్యాఖ్యలు

 Pv Sunil Kumar

పీవీ సునీల్ కుమార్.. ఏపీ పోలీస్ శాఖలో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను బదిలీ చేశారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీ సంజయ్‌కు ఏపీ సీఐడీ బాధ్యతలు ఇచ్చారు.. జీఏడీకి రిపోర్టు చేయాలని సునీల్‌ కుమార్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. తన బదిలీపై పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. ట్వీట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సునీల్ కుమార్. సునీల్ కుమార్ ట్వీటుపై పోలీస్ వర్గాల్లో చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. తాను డీజీపీ కాబోతున్నాననే సంకేతాలను పరోక్షంగా సునీల్ ట్వీట్ ద్వారా చెప్పారనే పోలీస్ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. ఐపీఎస్ సునీల్ కుమార్ ట్వీట్ ఎలా ఉందంటే.. డీజీపీగా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీని విడిచిపెడుతున్నా. సీఐడీలో మూడేళ్ల అద్భుతమైన, మరపు రాని ప్రయాణం చేశాను. సీఐడీలో నాకు డీజీపీగా ఎలివేషన్ వచ్చింది. అవకాశం కల్పించి నా కర్తవ్య నిర్వహణలో పూర్తి సహకారం అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు సునీల్ కుమార్.

ఆరోగ్యంపై అపోహలు వద్దు.. వాస్తవాలు తెలుసుకోండి

Sitting

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విస్తృతి కారణంగా ఆరోగ్యం విషయంలో అపోహలకు గురవుతున్నారు జనం. మిడిమిడి అవగాహనతో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం విసయంలో అపోహలకు దూరంగా వుండాలి. వాస్తవాలు తెలుసుకుని వాటిని ఆచరించడం ఎంతో ఉత్తమం.
అదేపనిగా కూర్చోవడం.. ధూమపానంతో సమానమా?
అవునంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈమధ్యకాలంలో అదేపనిగా కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అదేపనిగా కూర్చుని కదలకుండా పనిచేయడం ధూమపానంతో సమానం అంటున్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కూర్చోవడం కొత్తరకం ధూమపానం అనేది కొత్తగా వినిపిస్తున్న మాట. రెండేళ్ళ క్రితం జరిగిన అధ్యయనం ప్రకారం రోజుకి ఆరు గంటల కంటే ఎక్కువ కూర్చున్న వ్యక్తులు రోజుకు మూడు గంటల కంటే తక్కువగా కూర్చున్న వారి కంటే ముందుగానే చనిపోతారని సర్వేలో తేలింది. మీరు కూర్చున్నప్పుడు మీరు చేసే పనుల మధ్య వ్యత్యాసాలను గుర్తించాలి. మీరు రోజంతా కార్యాలయంలో కూర్చోవడం కొంచెం గట్టిగా అనిపిస్తే, కదిలేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉంటాయి. అదేపనిగా కూర్చోకుండా మధ్య మధ్యన లేవడం, అటూ ఇటూ తిరగడం ఎంతో అవసరం.

టీటీడీ పాలకమండలి సభ్యులకు గండం.. సుబ్బారెడ్డి నిర్ణయమే కారణమా?
టీటీడీ పాలకమండలి సభ్యులకు పదవీ గండం ఏర్పడింది. చైర్మన్ భాధ్యతల నుంచి తప్పుకుని, యాక్టీవ్‌ పాలిటిక్స్‌ పై వెళ్లాలన్న వైవి సుబ్బారెడ్డి నిర్ణయం, సభ్యుల పాలిట శాపంలా మారుతోంది. చైర్మన్ పదవికి వైవీ రాజీనామా చేస్తే..పాలకమండలి పూర్తిగా రద్దవనుంది. అయితే తిరిగి పాలకమండలిలో తమకు చోటు దక్కుతుందా అని.. ఆశగా ఎదురు చూస్తున్నారు కొందరు సభ్యులు.తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకం. పాలకమండలిలో సభ్యత్వం కోసం పైరవీలు మాములుగా వుండవు. రాష్ర్ట పరిధులు దాటి, కేంద్ర నాయకత్వం నుంచి కూడా సిఫార్సులు రావడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంటోంది వ్యవహారం. ఎన్నడూ లేని విధంగా గత పాలకమండలి ఏర్పాటు సమయంలో 25 మంది సభ్యులతో పాటు మరో 50 మందిని ఆహ్వానితులుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ, దేవాదాయశాఖ చట్టం మేరకు ఆహ్వానితులకు పాలకమండలిలో చోటు లేకపోవడం, ఈ అంశంపై కోర్టుకెక్కడంతో 50 మంది ఆహ్వానితుల నియామకం అటకెక్కింది. 2021 ఆగస్టులో టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నియమితులైతే, సభ్యులను సెప్టెంబర్ చివర్లో నియమించింది. అయినా వారి పదవీ కాలం ఆగస్టు నుంచే లెక్కింపు మొదలైంది.

వరుడికి అది రాదని పెళ్లికి నిరాకరించిన యువతి

Bride

ప్రతి ఒక్కరికి పెళ్లి అనగానే తమకు కాబోయే వాళ్లు ఇలా ఉండాలనే ఎన్నో ఆశలు పెట్టుకోవడం సర్వసాధారణం. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఉంటే సమస్య ఉండదు. కానీ చాలా వరకు అలా కుదరదు. ఒక్కోసారి అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. కొందరూ సర్దుకుని పెళ్లి అయ్యాక వారిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొంత మంది అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు.మరీ ఈ రోజుల్లో యువత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీదీ స్పీడ్‌గా అయిపోవాలి అనుకుంటారు. ఒకవేళ కాబోయే వాళ్లు నచ్చకపోతే అప్పటికప్పుడు పీటల మీద పెళ్లిని కూడా ఆపేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేస్‌లోని ఫారూఖాబాద్‌లో చోటుచేసుకుంది. ఇంకాసేపట్లో వివాహం జరగనుండగా.. పెళ్లికూతురు ఈ పెళ్లి వద్దంటే వద్దంటూ తెగేసి చెప్పేసింది. అయితే పెళ్లి వద్దనడానికి ఆమె చెప్పిన కారణం వింటే ఆశ్చర్యపోక తప్పదు మరి. ఇంతకు ఆమె చెప్పిందంటే.. ఆ వరుడికి లెక్కలు సరిగా రావని వివాహాన్ని రద్దు చేసింది.వివరాల్లోకెళ్తే.. గీతా సింగ్‌ అనే యువతికి, భరత్‌ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. మంచి ఘనంగా వివాహ తంతు సాగుతోంది. బంధుమిత్రులందరూ వారి వివాహాన్ని తిలకించి ఆశీర్వచనాలు అందించేందుకు వచ్చారు. కాసేపట్లో పెళ్లి జరగనుండగా.. ఆమె ఈ విషయం చెప్పి అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. ఆమెకు కుటుంబ సభ్యులు నచ్చజెప్పాలని చూసినా ససేమిరా అనేసింది.

ntv google news
  • Tags
  • Andhra Pradesh
  • india
  • Movies
  • Sports
  • telangana

WEB STORIES

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

RELATED ARTICLES

Nandamuri Taraka Ratna: లోకేష్‌ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత

TTD Mobile App: టీటీడీకి కొత్త యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సేవలు

AP Young Man Died in America: అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి.. ఉద్యోగంలో చేరిన 3 రోజులకే విషాదం

Ambati Rambabu vs Pawan Kalyan: మా నాన్న నాస్తికుడన్న పవన్‌.. కౌంటర్‌ ఇచ్చిన అంబటి

Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..

తాజావార్తలు

  • Identical Twins: కవలల వింత కోరిక.. ఒకేసారి ఒక్కరితోనే గర్భం దాలుస్తారట..

  • Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి

  • Pariksha Pe Charcha: పిల్లలపై ఒత్తిడి చేయొద్దు… పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీ

  • Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..

  • Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions