2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలి
సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదని తెలిపారు. గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని లక్ష్మణ్ సూచించారు. బీజేపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. బీజేపీ కార్యకర్తల పార్టీ అని తెలిపారు. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ మరింత బలపడిందని పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలను కమలం సవాల్ గా స్వీకరించిందన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీని ఓడించాలని చూస్తున్నారు తప్పా… ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఈ యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు లక్ష్మణ్. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని…బావిలో కప్ప మాదిరిగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం కార్యచరణ రూపొందించింది. ఈ నెల 29, 30న హరియాణాలోని గుర్గావ్ లో జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న పాలమూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు.
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం….విచారణ ఈ నెల 25కు వాయిదా
ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తి ఔరంగబేబు ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదంపై హిందూసేన తరుపున విష్ణుగుప్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మథుర కోర్టు విచారణ జరుపుతోంది. తాజాగా శుక్రవారం ఈ వివాదంపై అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ 3 కోర్టు విచారణ జరిపింది. తరుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్ లో మథుర కోర్టు షాహీ ఈద్గా మసీదు సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు పాటించాలని ఇటు హిందూసేనకు, అటు మసీదు కమిటీని ఆదేశించింది. అయితే దీనిపై ముస్లిం సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సర్వేపై కోర్టు స్టే విధించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల భూమిలో ఆలయాన్ని కూల్చివేసి ఈద్గాను నిర్మించాడని డిసెంబర్ 8న హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా, ఉపాధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ మసీదు ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా పిటిషన్ సవాలు చేసింది.
యువకుల కారు సరదా.. రోడ్డు పక్క నిలబడిన వ్యక్తి మృతి
కొంతమంది యువకుల సరదా జనానికి ప్రాణం మీదకి తెచ్చింది. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ముగ్గురు యువకులు సరదాగా రోడ్డు పక్క నిలబడిన ఒక వ్యక్తి ప్రాణం తీశారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు సమీపంలో ఖాళీగా ఉన్న ఒక ప్రయివేట్ లే అవుట్ లోని కందరాడకు చెందిన ముగ్గురు యువకులు కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుటుండడంతో బ్రేకు నొక్కబోయి ఎక్సలెటర్ నొక్కగా అదుపుతప్పి రోడ్డుప్రక్క బైకు పార్క్ చేసి కూలీలతో మాట్లాడుతున్న గొర్ల సత్తిబాబును ఢీకొట్టి ప్రక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసికెళ్లింది.. సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, స్వల్ప గాయాలతో మరో ఇద్దరు తప్పించుకున్నారు.స్థానిక జగ్గయ్య చెరువుకు చెందిన మృతుడు సత్తిబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. నర్సీపట్నం బిల్డింగ్ కాంట్రాక్టు తీసుకుని కూలీలను తీసుకెళ్లేందుకు ఫోన్ చేసి అక్కడకి రమ్మని వారితో మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది… కారులో ఉన్న ముగ్గురు మద్యం మత్తులో జన్నారు అని మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు.
దుమారం రేపుతోన్న ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్..
అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ తో దుమారాన్ని రేపుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ రచ్చకు దారితీసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను ఎంచుకోవడం కన్నా, విదేశీ తయారీ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో ఫైజర్ కంపెనీ భారత ప్రభుత్వం నుంచి చట్టపరమైన రక్షణను కోరినట్లు భారత ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. దీని వల్ల భవిష్యత్తులో చట్టపరమైన దావాల నుంచి మినహాయింపులు వస్తాయని ఆ కంపెనీ భావించింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లాను మీడియా ప్రశ్నలు అడిగింది. కరోనాపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయడం లేదని..దీన్ని మీరు ఎందుకు దాచారంటూ మీడియా ప్రశ్నించింది. మొదటగా 100 శాతం పనిచేస్తుందని.. ఆ తరువాత 80, 70 శాతం సమర్థంగా ఉంటుందని మీరు చెప్పారు కానీ వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతుందని జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే దీనికి సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ వీడియోను జోడిస్తూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.
కానిస్టేబుల్ పరీక్షలు.. వీటిని తీసుకురావద్దు
పల్నాడు జిల్లా నరసరవుపేటలోని ఎస్పీ కార్యాలయంలో గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ,ఎస్పీ రవిశంకర్ రెడ్డి లు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంలో ఐజీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ…ఆదివారం జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ రాత పరీక్షలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరవ్వాలని ఆయన కోరారు.ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకూ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్నులు మాత్రమే వినియోగించాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్,డిజిటల్ వాచీలు,ఇయర్ ఫోన్స్ లాంటి పరికరాలు తీసుకుని రాకూడదని వివరించారు..పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి లలో మొత్తం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు..పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.. మొత్తం 11,500 మంది పరీక్షకు హాజరవనున్నారన్నారు.. కానిస్టేబుల్ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కేంద్రాలు దూరంగా ఉంటే వారు దిగే బస్టాండ్ ల వద్ద తమ శాఖ వాహనాలు ఏర్పాటు చేశామని అభ్యర్థులు వాటిల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు..
గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి
రాష్ట్రంలో గిరిజన యువత ఉన్నత విద్య ఉద్యోగాలు పొందేలా నైపుణ్యం సాధించడంలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్. నంద్యాల జిల్లా బలపనూర్ గిరిజన పాఠశాలలో గిరిజనులు, గిరిజన విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి మాట్లాడారు. 28 శాతం గిరిజన జనాభా ఉన్న ఒడిస్సా నుంచి వచ్చానని, గిరిజనుల సమస్యలపై అవగాహన ఉందన్నారాయన. గిరిజనులను ఆధునిక జీవితానికి అలవాటు చేస్తూనే సంస్కృతి సంప్రదాయాలు రక్షించడానికి సమతుల్యత పాటించడం ఒక సవాల్ ఉందన్నారు గవర్నర్. ఏపీలో గిరిజనుల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక విద్య, ఆరోగ్యంపై దృష్టి సారిస్తోందన్నారు, విద్య , ఆరోగ్యం అతి ముఖ్యమైన విషయాలని ప్రభుత్వం గుర్తించిందన్నారు గవర్నర్. పరిశుభ్రత, తాగునీటికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించి దేశానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. మారుమూల గిరిజనులు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీల్లో తీసుకెళ్తున్నారని, అలాంటి ప్రాంతాల్లో గిరిజనులు స్వయంగా రోడ్లు వేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు గవర్నర్. ప్రధాని సడక్ యోజన నిధులతో గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత సూర్యనారాయణరాజు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు వంటి ప్రముఖులు మృతి చెందారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసీల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), కొత్త అల్లుడు (1979), కొత్తపేట రౌడీ (1980), ఏది ధర్మం ఏది న్యాయం (1982), ఉద్ధండుడు (1984), భలే తమ్ముడు (1985) తదితర చిత్రాలను సూర్యనారాయణ రాజు నిర్మించారు. సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ కలిసి ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, బాలకృష్ణ వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్‌తో తీసిన అడవి రాముడు చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వీళ్లు నిర్మించిన కుమార రాజా చిత్రంలో హీరో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు.
నీకోచ్ కే దిక్కులేదు.. నువ్వెంత? సర్ఫరాజ్‌పై చీఫ్ సెలెక్టర్ ఫైర్
భారత జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశకు గురైన ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్షన్ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తానూ మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తనను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తానని చెప్పి హ్యాండిచ్చాడని సర్ఫరాజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా.. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఈ యువ క్రికెటర్‌కు అండగా నిలిచారు. అయితే ముంబై మాజీ కెప్టెన్, ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ మిలింద్ రేగె మాత్రం సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాటర్‌గా సర్ఫరాజ్ పని పరుగులు చేయడం వరకేనని, జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అన్నది అతని చేతుల్లో లేని అంశమని చెప్పాడు. చేతుల్లో లేనిదాని గురించి మాట్లాడటం అనవసరమని, ఈ పిచ్చి వ్యాఖ్యలకు బదులు బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. “ఆటను మెరుగు పర్చుకుంటూ ఉండు. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు.