కేసీఆర్, కేజ్రీవాల్ కలిస్తే రైతురాజ్యం
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని, నిజామాబాద్ ఎంతో ముందడుగు వేసిందన్నారు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కులతార్ సింగ్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంజాబ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్, డిప్యూటీ స్పీకర్ జై సింగ్ రౌడీ ,.ఎం. పి. విక్రమ్ జిత్ సింగ్ సహని, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్ జీత్ సింగ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్పీకర్ కులతార్ సింగ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ బాగా అభివృద్ధి చెందింది అన్నారు. భారత దేశం ప్రపంచం గురువుగా ఉంది..ఢిల్లీలో మా ప్రభుత్వం అన్ని ఉచితంగా ఇస్తుంది..ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చదువు, వైద్యం పేదలకు ఉచితంగా ఇస్తున్నాం..పంజాబ్ లో ఉచిత కరెంట్ ఇస్తున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడితే రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయి..రైతులు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుంది.. రైతుబందు పథకంతో రైతులకు మేలు జరుగుతుంది..రైతుకు మంచి చేస్తేనే దేశానికి మంచి జరుగుతుందన్నారు.
పాప కిడ్నాప్ కేసు.. సైకో రాము సిద్దిపేటలో అరెస్ట్
సికింద్రాబాద్ లో కిడ్నాప్ అయిన చిన్నారి కథ సుఖాంతం అయిన సంగతి తెలిసిందే. ఆ పాపను పోలీసులు సైకో రాము నుంచి క్షేమంగా కాపాడి తల్లి ఒడికి చేర్చారు. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న ఉదయం మహంకాళి ఆలయం వద్ద చిన్నారి కృతికను ఎవరో అపరిచిత వ్యక్తి తీసికెళ్లిపోయాడు. పాప కిడ్నాప్ అయిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. పాపను ఎత్తుకెళ్ళిన సైకో రాము తన స్వస్థలమైన సిద్దిపేట జిల్లా దూల్ మిట్టకు తరలించాడు. అక్కడ గ్రామస్తులకు అనుమానం వచ్చి పాపను విచారించగా అసలు విషయం బయటపడింది. గ్రామస్తులు వెంటనే సర్పంచ్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే సిద్దిపేట పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు.. సైకోను అదుపులోకి తీసుకుని పాప కృతికను రక్షించారు. పాప చెవి దుద్దులను కిడ్నాపర్ పట్టుకెళ్లాడు. పాపను రక్షించిన పోలీసులు.. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తికి సమాచారం ఇచ్చారు. పాప కిడ్నాప్ కేసులో సైకో రాముని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం 11 గంటలకు చిన్నారి కృతిక మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు వచ్చిందని, 6 ఏళ్ల కృతిక ను అవ్వ ఇంట్లో వదిలేసి వచ్చారు.. అక్కడ మిస్ అయినట్లు ఫిర్యాదు అందిందని డీసీపీ చందనదీప్తి తెలిపారు. కృతిక అవ్వ బిల్డింగ్ వద్ద హోటల్ లో పని చేసే వ్యక్తి బాలిక ను తీసుకొని పోయాడని తెలిపారన్నారు. బాలిక ను ఆటో లో ఎక్కించుకొని వెళ్ళాడని, జేబీఎస్ నుంచి సిద్దిపేట వెళ్లినట్టు తెలిపారు.
ఆర్సీ పురంలో నడిరోడ్డుపై ప్రసవం.. స్పందించిన స్థానికులు
ఈమధ్యకాలంలో గర్భిణులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రోడ్డుపైనే ప్రసవించిందో మహిళ. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మహిళకు ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. నడిరోడ్డుపై కాసేపు నరకయాతన అనుభవించిందా గర్బిణీ. రోడ్డుపై మహిళ ఇబ్బంది పడుతున్న పట్టించుకోలేదు పాదచారులు, వాహనదారులు. మహిళ చుట్టూ అట్టముక్కలు పెట్టిన చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఆమెకు ప్రసవం చేశారు. తీవ్ర ఇబ్బంది పడిన అనంతరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందా మహిళ. తల్లీబిడ్డా ఆరోగ్యంగానే వున్నారు. రోడ్డుపైనే ప్రసవించిన మహిళ, బాబుని పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించారు స్థానికులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వైద్య సేవలు అందరికీ అందుబాటులో వున్నాయని అధికారులు, మంత్రి హరీష్ రావు చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూనే వున్నాయి.. గత నెలలో ఏపీలోని తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. తెలంగాణలోని నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది.
రైతులు.. రైతు కూలీలకు తేడా తెలీదా?
తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. BRS పార్టీ లో KTR ఏందో మాకు తెలియదు. BRS నేతలు అబద్ధాలు మీద అబద్ధాలు చెబుతున్నారు… రైతు దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేశారు. రైతులకు రైతు కూలీలకు తేడా తెలియని వ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు ప్రకాష్ రెడ్డి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మిస్తున్నామని కేంద్రం దృష్టికి తీసుకెళ్ల లేదు. బిజెపి రైతు వ్యతిరేకి అని రాజకీయ దిగజారుడు పనిని BRS చేస్తుందన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు కేటీఆర్ చేస్తున్నారని తీవ్రమంగా మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ.. తన నియోజక వర్గంలో నిర్మించిన ఒక స్కూల్ ని చూపించి తెలంగాణ అంతా ఇలానే ఉందని చెబుతున్నాడు కేటీఆర్. స్కూల్స్ లో సరైన సౌకర్యాలు లేక, టీచర్ లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. సరూర్ నగర్ జూనియర్ కాలేజీ లో టాయిలెట్లు లేక అమ్మాయిలు పడ్డ కష్టాలు మీ దృష్టికి రాలేదా కేటీఆర్? అని సంగప్ప ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూల్స్ లో టాయిలెట్స్ లేని స్కూల్స్ లో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. స్కూల్స్ లో స్కావెంజర్ లు లేరు…. అధ్వాన్న పరిస్థితి నెలకొని ఉందన్నారు. అన్ని నియోజక వర్గాల్లో విద్యాలయాలను కట్టించిన తర్వాత ట్వీట్ చెయ్యి కేటీఆర్ అని ఎద్దేవా చేశారు సంగప్ప.
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు సదస్సులో జగన్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలుసు అన్నారని.. వ్యవసాయం దండగ అని.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు వ్యవసాయం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారని.. నీతి ఆయోగ్ దేశమంతా ఆర్బీకేలు పెట్టాలని పరిశీలిస్తుంటే చంద్రబాబు మాత్రం వృధా అని చెప్పడాన్ని ప్రజలు గమనించాలన్నారు.
భారత్ హిందువుల భూమి.. శాంతాక్లజ్ ది కాదు
క్రిస్మస్ వేడుకలపై హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని పాఠశాలలు విద్యార్థులు ఎవరూ కూడా శాంతాక్లాజ్ వేషధారణ ధరించేందుకు అనుమతించకూడదని హెచ్చరించింది. ఇదే విషయంపై భోపాల్ నగరంలోని అన్ని విద్యాలయాలకు వీహెచ్‌పీ లేఖలు రాసింది. సనాతన హిందూ మతం, సంస్కృతిని విశ్వసించే విద్యార్థులను క్రిస్మస్ చెట్లను తీసుకురావానలి.. శాంటాక్లాజ్ దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించింది. దీన్ని హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించింది వీహెచ్‌పీ. హిందూ పిల్లలపై క్రైస్తవ మతాన్ని రుద్దే కుట్ర జరుగుతోందని ఆరోపించింది. హిందూ పిల్లలను క్రిస్టియన్ మతంలోకి ప్రేరేపించే కుట్రగా.. ఇలాంటి డ్రెస్సులు, చెట్లను కొని తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని వీహెచ్‌పీ ఆరోపించింది. హిందూ పిల్లలను క్రైస్తవ మతం వైపు ఆకర్షించేందుకు పాఠశాలలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించింది. హిందూ పిల్లలు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, గౌతమ్, మహావీర్, గురు గోవింద్ సింగ్ లుగా గొప్ప వ్యక్తులుగా మారాలి అని శాంతాక్లాజుల్లా మారకూడదు అని వీహెచ్‌పీ అంది. భారతదేశం సాధువుల దేశం అని.. శాంతాక్లాజుల దేశం కాదని పేర్కొంది. అలాంటి పాఠశాలలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ట్రైలర్ కట్ అదిరింది.. ఘట్టమనేని అభిమానులకి జాతరే
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ హీరోగా మార్చిన ‘ఒక్కడు’ సినిమా రీరిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2023 జనవరి 15కి ఇరవై ఏళ్లు అవుతున్న సంధర్భంగా, మేకర్స్ ‘ఒక్కడు’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 జనవరి 7న ఒక్కడు సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన మేకర్స్, ఈ మూవీ కొత్త ట్రైలర్ ని బయటకి వదిలారు. ఆడియోని బూస్ట్ చేసి, విజువల్ ని 4కి మార్చి కట్ చేసిన రెండు నిమిషాల ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. మహేశ్ బాబుకి సంబంధించిన కట్ షాట్స్ ఆకట్టుకున్నాయి. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని గుణశేఖర్ తెరకెక్కించాడు. స్పోర్ట్స్ మరియు ఫ్యాక్షన్ జానర్ లని మిక్స్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన గుణశేఖర్, ‘ఒక్కడు’ రీరిలీజ్ గురించి ఒక్క కామెంట్ కూడా చెయ్యకపోవడం విశేషం.
శ్రద్ధావాకర్ తరహా కేసు.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో సహజీవనంలో ఉన్న తమ భాగస్వామని హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ హత్యే తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు తనతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళను ఏడు నెలల క్రితం చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితుడు రామన్, తనతో సహజీవనంలో ఉన్న మహిళ కనిపించడం లేదని మే20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. పోలీసులు విచారణలో ఈ కేసులో విస్తూపోయే నిజాలు బయటకు వచ్చాయి. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) దీక్షా శర్మ మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన మహిళను రామన్ చంపాడని.. ఆ తరువాత ఆమె మిస్ అయినట్లు ఇందిరాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని వెల్లడించారు.