కాంగ్రెస్ దిక్కూ దివానం లేని పార్టీ
ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల మార్చ్ లు, సభలు ర్యాలీల హడావిడి కొనసాగుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఖాళీలను ఎక్కువగా భర్తీ చేశామన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోవడానికి గత ప్రభుత్వలతోపాటు.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. లీకేజీల మీద మాట్లాడిన దొంగను పట్టుకున్న తర్వాత రూట్ మార్చి నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ అని ఆయన అన్నారు.అంతేకాకుండా.. తప్పుల తక్కడలా తయారైంది కాంగ్రెస్ పార్టీ అని, మార్చ్ లు, ర్యాలీలు చేస్తున్న రాజకీయ నిరుద్యోగులకు 2023 ఎన్నికల తరువాత ఏప్రిల్ ఫస్ట్ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా లో ఉన్నదే నాలుగు ఈకలని, ఆ నాలుగు ఈకలు కూడా ఎవరిగోల… వాళ్లదే అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయాలలో లీకేజీలు ఒక భాగంగా మారిందని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ బీ-టీం గా పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సి వస్తే అది ఢిల్లీలో చేయాలని ఆయన హితవు పలికారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీకి వ్యతిరేకంగా దీక్ష చేయాలని, ఏటా రెండు కోట్లు కాదు కదా సంవత్సరానికి 2 లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి.
బైక్ పై రీల్స్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే?
ఈమధ్య కాలంలో యువత బాగా దూసుకుపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావం వారిపై బాగా పడుతోంది. సోషల్ మీడియాలో తాము కనిపించాలని, తమ వీడియోలు అప్ లోడ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే, తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా విజయవాడలో ఓ యువతి చేసిన రీల్స్ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇన్ స్టాలో రీల్స్ చేసిన యువతి భరతం పట్టారు విజయవాడ పోలీసులు. ఇన్స్టా రీల్స్ చేసిన యువతి కి ఫైన్ విధించారు విజయవాడ పోలీసులు. విజయవాడ కనకదుర్గ వారధిపై నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇన్స్టా రీల్స్ చేసింది తనూజ అనే యువతి.తాను డ్రైవ్ చేస్తూ చేసిన రీల్స్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోకు లైక్స్, షేర్ లు వచ్చాయి. ఆమె చేసిన ఇన్ స్టా రీల్స్ పై ఓ నెటిజన్ ట్విట్టర్లో స్పందిస్తూ విజయవాడ పోలీసులను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమె వాహనానికి చలానా విధించినట్లు ట్వీటర్లో పేర్కొన్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు పోలీసులు. ఇలా రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడం, సోషల్ మీడియా పిచ్చితో ఇబ్బందుల పాలు కావడం ఈమధ్య కామన్ అయిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా కోసం ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిది.
సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డిని ఏం అడిగారంటే?
8 గంటలుగా కొనసాగుతుంది ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ .. హత్యకు ముందు మూడు గంటలు ఏం జరిగింది? ఉదయం 10:30 నుంచి విచారిస్తూనే ఉన్న సిబిఐ… ఉదయ్ కుమార్ ,భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో అవినాష్ ని ప్రశ్నిస్తున్న సిబిఐ…వివేక్ ఇంటికి రాకముందు మీరు ఎవరెవరిని కలిసారని ప్రశ్నిస్తున్న సీబీఐ…కేసులో అరెస్ట్ అయిన వాళ్లంతా మీతో ఎందుకు సమావేశమయ్యారని అడిగిన సిబిఐ… ప్రశ్న జవాబులను రాతపూర్వకంగా తీసుకుంటున్న సిబిఐ…అవినాష్ విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు చేసింది సిబిఐ.
రోసా రూల్స్ మార్పుచేర్పులపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు
ఏపీలో రోసా రూల్స్ మార్పు చేర్పులపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోసా రూల్స్ మార్పు చేర్పులపై ప్రభుత్వంతో ముగిసిన ఉద్యోగ సంఘాలర ప్రతినిధుల సమావేశం ముగిసింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై ఉద్యోగ సంఘాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రోసా రూల్సును సమూలంగా మార్చాలంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.రూల్సును సక్రమంగా అమలు చేస్తే చాలునని.. మార్పులు చేర్పులు అవసరం లేదన్నాయి ఏపీ జేఏసీ సహా ఇతర సంఘాలు.నిబంధనలను విరుద్దంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి.. పండిత పరిషత్ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చోటు కల్పించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. రోసా రూల్స్ మార్పు చేర్పులపై కమిటీ వేసిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ జరిగింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై అభిప్రాయాలు తెలిపేందుకు సోమవారం సాయంత్రంలోగా ఓ ఫార్మెటును ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్న ప్రభుత్వం.అభిప్రాయాలు చెప్పేందుకు 15 రోజుల గడువు విధించిన ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ రోసా రూల్సును సమూలంగా మార్చాలి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అర్హతతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన సంఘాలకు గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు లేకుండా ఉండాలంటే రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం ఉంది. పిక్ అండ్ చూస్ విధానాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
రొమాన్స్ విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య
భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ మద్యం సేవించడం వల్ల ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయంటే నమ్మక తప్పదు. ఆల్కహాల్ సేవనం తర్వాత ఇంటికొచ్చి కుటుంబీకులతో గొడవ పడిన ఘటనల గురించి వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు వ్యక్తిగత దాడుల వరకు వెళ్లాయి. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. శారీరక సాన్నిహిత్యం విషయంలో భర్తతో గొడవపడి ఓ మహిళ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త బావిలోకి దూకాడు. బావిలో దూకిన భార్యను కాపాడాడు. కానీ కాపాడిన కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ఆ భర్తే చంపేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శంకర్‌రామ్, అతని భార్య ఆశాబాయి ఇద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించి పడుకున్నారు. దీంతో శంకర్ తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను కోరాడు. శంకర్‌తో శృంగారానికి ఆశా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శారీరక సాన్నిహిత్యానికి సంబంధించిన గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే, ఆశా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యను కాపాడేందుకు శంకర్ కూడా బావిలోకి దూకాడు. కాసేపటి తర్వాత ఆశాను కాపాడి బావిలో నుంచి బయటకు తీశాడు.
జగన్ పై రాజకీయకుట్ర జరుగుతోంది
ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదిరిపోతోంది. సీఎం జగన్ పై దారుణమైన రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ కుట్ర చేస్తున్నారు. జగన్ వ్యక్తిత్వం తక్కువ చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని సుధాకర్ బాబు అన్నారు. ముద్దాయి దస్తగిరి బయటకి వచ్చి హత్య చేసిన విధానం చెప్పడం ఏంటి..?గొడ్డలితో నరికానని చెప్తుంటే సునీత ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..?సునీత భర్త కు ఈ హత్యలో సంబంధం ఉంది.. ఆ యాంగిల్ లో విచారణ జరపాలి.మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చంద్రబాబు తొలి ముద్దాయి.తొలి ముద్దాయిగా చంద్రబాబును చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు నెలలు విచారణ చేశారు.అప్పుడెందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి పేర్లు రాలేదు..?బాధితుల్ని ముద్దయిలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రానికి కావాల్సిన నిధుల సేకరణ కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళడం సాధారణం. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు సుధాకర్ బాబు.
ఏపీలో గురువారం వడగాల్పులు….బయటకు వెళితే అంతే సంగతులు
ఏపీలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో అయితే తీవ్ర వడగాల్పులతో జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. ఐఎండి అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉంది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(125) :-
అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి 15,
తూర్పుగోదావరి 4,
ఏలూరు 2,
బొట్టు పెట్టుకుంటే అందం… ఆరోగ్యం
బొట్టు పెట్టుకోవడం మన దేశ సనాతన సాంప్రదాయం. మన అమ్మమ్మలు, అమ్మలు.. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించేవాళ్లు. కానీ కాలం మారింది బొట్టు సైజ్ తగ్గింది. కుంకుమను.. స్టిక్కర్స్ రీప్లేస్ చేశాయి. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు ధరించినప్పుడల్లా.. లుక్ పూర్తి కావాలంటే చక్కని, అందమైన బొట్టు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే.. ముఖం నిండుగా కనిపిస్తుంది. కేవలం అందంగా కనిపించడానికి.. సంప్రదాయం కోసం బొట్టు పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. అయితే ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళలు తమ బొట్టు ధరించే.. స్థలాన్ని అజ్ఞా చక్రం అంటారు.. ఇది మానవ శరీరంలో అరవ, అత్యంత శక్తివంతమైన చక్రంగా అభివర్ణిస్తారు. బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్ ను రోజుకు చాలా సార్లు నొక్కుతారు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. వీటన్నింటికీ కేంద్ర స్థానం అజ్ఞా చక్రం. అంటే కనుబొమ్మల మధ్య స్థానం అని అర్థం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా నేడు రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 26వ మ్యాచ్ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడునుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగనుంది.ఇదిలా ఉంటే. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో రెండో స్థానంలో ఉంది. అలాగే.. లక్నో సూపర్ జెయింట్స్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఫాంలో ఉంది. అయితే.. ఈ రెండు జట్ల మధ్య నేడు ఉత్కంఠ పోరు జరుగనుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆటగాళ్ల ఫామ్ విషయానికి వస్తే.. లక్నో కంటే రాజస్థాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత గ్రౌండ్‌లో ఆడటం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్ కానుంది. లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో రాజస్థానే విజయం సాధించింది.
బెడ్ సీన్స్ .. ఆ పార్ట్స్ కనిపించకుండా చేతులను అడ్డుపెట్టి
అమెరికా కోడలు ప్రియాంక చోప్రా ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రిచర్డ్ మాడాన్, ప్రియాంక జంటగా రస్సో బ్రదర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక అమెజాన్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, రిచర్డ్ మాడాన్, ప్రియాంక మధ్య బెడ్ సీన్స్ గురించే చర్చ జరుగుతోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఏప్రిల్ 28 న అమెజాన్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంకకు బెడ్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పెళ్లి తరువాత ఇలాంటి బెడ్ సీన్స్ చేయాలంటే గట్స్ కావాలి. అందులో ప్రియాంక అంటే .. ఎన్నో ట్రోల్స్ వస్తాయి. వాటిని పట్టించుకోకుండా ఎలా ఇవన్నీ చేశారు అన్న ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెప్తూ.. ” నేను, రిచర్డ్ బెడ్ సీన్స్ లో చాలా ఇబ్బంది పడ్డాం. బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు ఒకరినొకరు సపోర్ట్ గా నిలిచాం. ఇక మరీ ఘాటు సన్నివేశాలు, కొన్ని యాంగిల్స్ లో అయితే చాలా ఇబ్బంది పడ్డాం.