సమయం లేదు మిత్రమా.. సమరానికి సిద్ధం కావాలి
ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సమాయత్తం అవుతోంది. 2024, జూన్ వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించింది. దీంతో పాటు ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులు మాత్రమే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులెకు దిశానిర్ధేశం చేశారు. ఈ 400 రోజులు బీజేపీకి కీలకం అని సూచించారు. కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ పాదయాత్రను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ 400 రోజుల్లో ప్రజలకు, ఓటర్లకు చేరువ కావాలని కోరారు. 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లపై దృష్టి పెట్టాలని మోదీ అన్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వారికి చరిత్ర, గత ప్రభుత్వాలు ఏమి చేశాయో తెలియదని.. మనం వారికి అవగాహన కల్పించాలని, సుపరిపాలనలో భాగం కావడానికి వారికి సహయపడాలని మోదీ సూచించినట్లు వెల్లడించారు.
మీడియా ముందు ఏడ్చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే
కేంద్రమంత్రి, బీజేపీ నేత అశ్వినీ చౌబే మీడియా ముందు భోరున విలపించారు. సోమవారం చనిపోయిన బీజేపీ నేత పరుశురామ్ చతుర్వేదిని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ నాయకుడు, కిసాన్ మోర్చా నాయకుడు పరుశురామ్ చతుర్వేదికి పాట్నాలో సంతాపాన్ని తెలుపుతూ విలేకరుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పక్కన ఉన్నవాళ్లు ఓదార్చే ప్రయత్నం చేసినా.. కన్నీళ్లు దిగమింగుకోలేకపోయారు. బీహార్ లోని బక్సర్ లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల హింసకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘జన్ ఆక్రోశ్ యాత్ర’లో చతుర్వేది సోమవారం గుండెపోటుతో మరణించారు. గత మూడు రోజులుగా చలికి రైతులకు మద్దతుగా నిరాహారదీక్షలో నాతో ఉన్న నా తమ్ముడు మరణించినట్లు ఇప్పుడే వార్త అందిందంటూ చౌబే ఉద్వేగానికి లోనయ్యారు. చౌసా పవర్ ప్లాంట్ కోసం తమ భూమిని సేకరించినందుకు బక్సర్ లోని రైతులు మూడు నెలల పాటు నిరసన తెలుపుతున్నారు. తమపై దాడి జరుగుతున్న పోలీసులు చర్యలు తీసుకోలేదని బక్సర్ ఎంపీ ఆరోపించారు. దీనిపై బీహార్ డీజీపీకి లేఖ రాశారు.
చైనా తర్వాత అమెరికా నుంచే భారత్‌కు ముప్పు…సర్వేలో వెల్లడి
భారత దేశానికి సైనిక పరంగా ముప్పు చైనా నుంచి పొంచి ఉందనేది అందరికి తెలిసిన విషయమే. చైనా నుంచే అతిపెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే ఆ తరువాతి స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటారు.. కానీ, రెండో స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఓ సర్వేలో తెలిపారు. అమెరికాకు చెందిన గ్లోబల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. ప్రతీ 1000 మందిలో 43 శాతం మంది చైనా నుంచి మిలిటరీ ముప్పు పొంచి ఉందని భావిస్తుంటే.. 22 శాతం మంది అమెరికా నుంచి ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది అక్టోబర్ నెలలో ఈ సర్వేను నిర్వహించారు. 2020 నుంచి భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, సరిహద్దు వివాదం కూడా ఉందని చైనా నుంచే ఇండియాకు ఎక్కువ సైనిక ముప్పు ఉందని సర్వేలో తెలిపారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సహజ భాగస్వాములుగా కనిపిస్తున్నప్పటికీ.. అమెరికా, చైనాల మధ్య ఘర్షణ ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఇండియన్స్ భావిస్తున్నారు.
దేవుడి భూమికే దిక్కులేదు.. దర్జాగా కబ్జా
హే హనుమాన్.. నీ భూమికి నీవే రక్షకుడివి.. కబ్జాదారుల నుంచి నిన్ను నీవే కాపాడుకో అంజనీ పుత్ర అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ దేవాలయం భూమి బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా తమపైనే అక్రమ కేసులు పెట్టారంటూ ఎస్సార్ నగర్ యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని 15వ డివిజన్ ఎస్ ఆర్ నగర్లో ఉన్న హనుమాన్ దేవాలయం భూమిని స్థానిక బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఎస్సార్ నగర్ కు చెందిన యువకులు జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డిఓ, ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేశారు. నిన్న స్థల పరిశీలకు వచ్చిన అధికారులు వివరాలను నమోదు చేసుకొని వెళ్లిపోయారు దీంతో స్థానికంగా ఉండే బి.ఆర్.ఎస్ నాయకులు రాజశేఖర్ నరసింహ తో పాటు మరికొందరు యువకులతో గొడవకు దిగారు గుర్రం మొదలవడంతో ఇరువర్గాలు ఏనుమాముల పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు.
సంక్రాంతి వేళ ఆర్టీసీకి కాసుల వర్షం
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.. ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఈ పండుగ సీజన్ లో రికార్డు స్థాయిలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 11 నుంచి 14 వరకు 1.22 కోట్ల మంది ప్రయాణికులు తమ సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 లక్షల మంది ఎక్కువగా ప్రయాణించారని ప్రకటించారు. సంక్రాంతి తిరుగుప్రయాణానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై అధికారులతో హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చిన సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. తిరుగు ప్రయాణంలోనూ అదే రకంగా పనిచేసి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11 నుంచి 14 వరకు 3203 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపారు. ఆయా రోజుల్లో 2384 బస్సులను నడపాలని నిర్ణయించగా.. రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులను నడిపినట్లు ఆయన వివరించారు.
మీ బట్టలు తెల్లగా మెరిసిపోవాలంటే… ఈ పనిచేయండి చాలు
ఈరోజుల్లో వాషింగ్ మెషీన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో అత్యాధునిక మోడల్స్ కలిగిన వాషింగ్ మెషీన్లు అందుబాటులో వున్నాయి. పాత వాషింగ్ మెషీన్లు మార్చేసి కొత్తవి తీసుకుంటున్నారు. మీరు బట్టలు ఉతికేటప్పడు బట్టలు ఫ్రెష్ గా ఉండాలంటే ఉజాలా, లేదా షైన్ వంటి స్పెషల్ పౌడర్లు వాడడం కామన్. కానీ ఈసారి మీరు ఈ చిట్కా పాటిస్తే మాత్రం అవాక్కవడం ఖాయం. మీ వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికేటప్పుడు కాస్త ఆస్పిరిన్ మాత్రలను వాడితే అద్భుతమైన ఫలితం వుంటుందని చెబుతున్నారు. వాషింగ్ మెషిన్లలో ఉత్తమమైన లాండ్రీ డిటర్జెంట్లు వాడుతుంటారు. అయితే తెలుపు బట్టలు తెల్లగా వుండాలంటే.. ఆస్పిరిన్ మాత్రలను వాడటం మంచిది. ఇవి మందుల షాపులో దొరుకుతాయి. తెల్లని దుస్తులు.. డల్ గా కాకుండా తెల్లగా, ఫ్రెష్ గా వుండాలంటే.. 323 మిల్లీగ్రాముల ఐదు ఆస్పిరిన్ మాత్రలను ఓ డజను తెల్ల బట్టలను ఉతికేందుకు వాడుతున్నారు.
రవితేజ ఖాతాలో వరుసగా రెండు 100 కోట్ల చిత్రాలు
చిత్ర పరిశ్రమలో హీరోలకు అప్ అండ్ డౌన్స్ సహజం. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆ తర్వాత వచ్చే ఒక్క హిట్ తో మరో రెండేళ్ళు సర్వైవ్ కావచ్చు. అందుకు తాజా ఉదాహరణే రవితేజ. ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో వెనుక బడ్డ రవితేజ ‘క్రాక్’తో ఒక్క సారిగా రేస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత రెండు ప్లాఫ్స్ ఎదురైనా మళ్ళీ డిసెంబర్ విడుదలైన ‘ధమాకా’తో తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’తో మాస్ మహారాజా తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరాడు. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ తో నిర్మాతలు భారీ లాభాలను అందుకున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి రవితేజ ఖాతాలో మరో పెద్ద హిట్ పడింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీలక పాత్రలో మెరిశాడు. ఈ పాత్ర సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది.
ఇషాన్ కిషన్‌కు ప్లేస్ ఫిక్స్ చేశాం.. ఈ సిరీస్‌లో ఆడతాడు
రేపు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌లో బలమైన టీమ్‌తో తాము ఆడబోతున్నామని.. తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి తమకు ఇది మంచి అవకాశమని రోహిత్ అన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడని ఇషాన్ కిషన్‌కు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అవకాశం కల్పిస్తామని.. అతడిని మిడిల్ ఆర్డర్‌లో పంపిస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. సిరాజ్ బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడని.. మ్యాచ్ మ్యాచ్‌కు అతని గ్రాఫ్ పెరుగుతూనే ఉందని.. కొత్త బాల్‌తో వికెట్స్ తీస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు. కాగా హైదరాబాద్‌లో తొలిసారి హోమ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు రోహిత్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మూడు ఫార్మాట్లలో సిరాజ్ ముఖ్యమైన ఆటగాడు అని.. ప్రపంచకప్ నాటికి అతడిపై వర్క్ లోడ్ పెంచుతూ సిద్ధం చేస్తామన్నాడు.