6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ
నేడు నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు యాత్ర సాగనుంది.
విహారయాత్రలో విషాదం.. విద్యార్థులు బస్సుబోల్తా.. 12 మందికి గాయాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లోని కడియంకు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు బోల్తా పడింది. బస్సులో 40 మంది డిగ్రీ చదువుతున్న విద్యార్థినిలు ఉండగా వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని ప్రైవేటు కళాశాలకు సంబంధించిన విద్యార్థినులు విజ్ఞాన టూర్ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని కడియం కి వెళ్లి వస్తున్నారు. ఇది ప్రైవేటు బస్సు కావడంతో ప్రధానమైన రహదారి మీదునుంచి కాకుండా మరో రహదారి నుంచి సత్తుపల్లి కి సమీపంలోకి వస్తుండగా అశ్వరావుపేట మండలం పాపిడి గూడెం వద్ద బోల్తా పడింది. ఈ ఘటన లో 12 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వారందరినీ అశ్వరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలెర్ట్
ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే టార్గెట్ నేతలు పలు నగరాలకు వెళ్లినట్లు సమాచారం. PLGA వారోత్సవాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలసాయి దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జిల్లాలకు కమ్మేసిన పొగమంచు
వరంగల్ జిల్లా ఏజెన్సీని పొగమంచు కమ్మేస్తుంది.. ములుగు జిల్లా ఏటూరు నాగారం.. వాజేడు ప్రాంతాల తో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పొగమంచు పెరిగింది. ఇక మహబూబాబాద్ జిల్లాను దట్టంగా పొగమంచు కప్పేసింది. దింతో సమీపం లో ఉన్న వాళ్ళు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. 8 దాటినా వాహన దారులు లైట్స్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది.
కిటికీలో నుంచి వచ్చిన మృత్యువు
నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళ్తోంది. అయితే అంతలోనే ఎక్కడి నుంచి దూసుకువచ్చిందో తెలియదు కానీ ఓ ఇనుప కడ్డీ కిటికీ అద్దాలను పగులకొట్టుకుంటూ హరికేశ్ మెడలో గుచ్చుకుంది. అతడి కళ్లలోంచి కూడా రక్తపు ధారలు బయటకి వచ్చాయి. అవి పక్క సీటు వరకు పారుకుంటూ వెళ్లాయి. పక్కన ఉన్నవారు ఏం జరిగిందో తెలుసుకునేలోపే హరికేశ్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అలీగఢ్ జంక్షన్‌లో రైలును నిలిపివేసి మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు.
భారత్‌కు అమెరికా అండగా ఉంటుంది..
భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ‘యుద్ అభ్యాస్’పేరుతో ఉత్తరాఖండ్ లో ఇరు దేశాల సైనికులు సైనిక విన్యాసాలు చేస్తున్నారు. చైనా సరిహద్దు ఎల్ఓసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. అయితే ఈ సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ 1993,96 ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో భారత్ కు అండగా నిలిచింది అమెరికా.
గూగుల్ సీఈఓకి పద్మభూషణ్..
టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రధానం చేశారు అమెరికాలోని భారత రాయబారి. 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ ఏడాది 17 మందికి అవార్డుల్లో ప్రకటిస్తే అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోతో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, సుందర్ పిచాయ్ కి ఈ పురస్కారాన్ని అందించారు.
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం..
ప్రపంచం గత మూడేళ్లుగా కరోనా వైరస్ తో కష్టాలు పడుతోంది. దీనికి తోడు ఇటీవల మంకీపాక్స్ వైరస్ కూడా ప్రపంచాన్ని కలవరపెట్టింది. భారత్ లో కూడా పదికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి జికా వైరస్ కలవరం మొదలైంది. మహరాష్ట్రలో ఓ వ్యక్తితో జికా వైరస్ గుర్తించారు. పుణేలోని బవ్‌ధాన్ ప్రాంతంలో 67 ఏళ్ల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.
జక్కన్నకి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్…
ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమాని వెస్ట్ ఆడియన్స్ ఇంతలా మెచ్చుకుంటారా? ఒక ఇండియన్ డైరెక్టర్ ని హాలీవుడ్ లో ఇంత పేరోస్తుందా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్న రాజమౌళి ఖాతాలో మరో అవార్డ్ వచ్చి చేరింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) ‘బెస్ట్ డైరెక్టర్’ గా ‘రాజమౌళి’ పేరుని అనౌన్స్ చేసింది.
రామ్ చరణ్ కే క్రేజీ అవార్డు..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరుని టాప్ ట్రెండింగ్ లో పెడుతున్నారు మెగా ఫాన్స్. #RamCharanTo LeadIndianCinema #FutureOfYoungIndiaRC అనే హాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. ఉన్నపళంగా మెగా అభిమానులు జోష్ లోకి కారణం ఎంటా అని చూస్తే, చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ఇన్ ఎంటర్టైన్మెంట్(Future of Young India in Entertainment Award to Charan) అవార్డ్ లభించింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ కి ఈ అవార్డ్ రావడాన్ని చాలా స్పెషల్ గా చూస్తున్నారు మెగా ఫాన్స్. చరణ్ తో పాటు ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోనూ సూద్, తాప్సీలు ఈ అవార్డ్ రేసులో ఉన్నారు. వీళ్లందరినీ వెనక్కునెట్టి రామ్ చరణ్ అవార్డు సాధించడం విశేషం. ఈ అవార్డు రావడాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మెగా అభిమానులు ‘రామ్ చరణ్ సిన్స్ 2007’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.