వికేంద్రీకరణ మా విధానం.. పవన్ కోరిక తీరేది లేదు
మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీంకోర్టు భావించిందన్నారు. ప్రభుత్వ విధానాలలో తప్పోపులను నిర్ణయంచాల్సింది ప్రజలే అని.. ఈ అంశం ప్రజా కోర్టులోనే ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సహజ న్యాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలన్నారు. అలాంటపుడు మిగిలిన వ్యవస్థలు జోక్యం చేసుకోరాదని సజ్జల అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకున్నందుకు వైసీపీకి అన్ని ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని ఆధిక్యం ఇచ్చారని సజ్జల అన్నారు. ఒకే రాజధాని ఉండాలి, అక్కడే అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుని ఉంటే గత ఎన్నికల్లో వ్యక్తమయ్యేదని.. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న చంద్రబాబు నిర్ణయానికి ప్రజల మద్దతు లభించలేదని తెలిపారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టలేమని తేలిపోయిందన్నారు. జగన్ మూడు రాజధానులు చట్టం చేసిన తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో జనం మద్దతు తెలిపారన్నారు.
ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్పత్రిలో చేరారు.. ఆయనకు సర్జరీ కూడా జరిగింది.. ఈ విషయాన్ని రాజాసింగ్ స్వయంగా వెల్లడించారు.. ఇంతకీ రాజాసింగ్‌కు ఏమైంది? సర్జరీ ఏంటి? అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తానంటూ సందేశాన్ని పంపించారు.. ‘జైలు నుండి బయటకు రావడానికి ముందు, నా నుదిటిపై చిన్న గడ్డ ఉంది, దాని కారణంగా నాకు చాలా నొప్పి వచ్చిందని పేర్కొన్న రాజా సింగ్.. ఈ రోజు ఆస్పత్రిలో చేరి నేను లిపోమా సర్జరీ చేయించుకున్నాను అని తెలిపారు.. అయితే, సర్జరీ కారణంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని.. నేను అతి త్వరలో నా గోషామహల్ ప్రజల మధ్య ఉంటాను అని వెల్లడించారు ఎమ్మెల్యే రాజాసింగ్.
జగన్ పథకాలు చూసి విపక్షాలు తట్టుకోలేక పోతున్నాయ్
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో జగనన్న క్రీడా సంబరాలు-2022ను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గాల వారు , నా పిల్లలకు నా శాఖ ద్వారా సేవ చేయడం, ఆనందంగా భావిస్తున్నాని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టినా ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృధి కి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం జగన్ అన్న అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు. వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేక పోవడం వారికి కావలసినది కార్పొరేట్ స్థాయి విద్యార్థులే. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు, భజన అంటున్నారన్నారు. భజన అంటే ఎలా ఉంటుంది అంటే వైఎస్సాఆర్ కట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు ఇది భజన అంటూ వ్యంగంగా మాట్లాడారు.
వేపచెట్టుకి అమ్మవారి ఆకారం.. వైరల్ అవుతున్న ఘటన
నంద్యాల జిల్లా బనగానపల్లె, తెలుగుపేటలోని పాత బావి వద్ద ఉన్న వేప చెట్టుకు ఈ వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టు మొదలుభాగంలో అమ్మవారి రూపంతో ఆకారం ఏర్పడి కనిపించింది. దీంతో స్థానికుల్లో భయంతో పాటు భక్తి భావం కూడా ఏర్పడింది. తెలుగు పేట కాలనీవాసులు ఇంటి ఇలవేల్పు అమ్మగా భావించి పూజించే సాక్షాత్తు జమ్ములమ్మ తల్లి వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ.. అమ్మవారి రూపం ఆకారం ఏర్పడిన చోట , భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు రాసి , ఆభరణాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేపచెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన వింత ఘటన సమాచారం పట్టణంలోని వివిధ కాలనీవాసులకు తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి, నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకుంటున్నారు. వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడి హాట్ టాపిక్ గా మారిన ఈ వేప చెట్టును గత కొద్ది నెలల క్రితం చెట్టు పైభాగాన్ని రంపం యంత్రంతో కోసివేసి చెట్టును పైభాగం అంతా కోసి వేసి తొలగించడం జరిగింది. చెట్టును కోసి వేయడం వల్లే అమ్మవారు ఆగ్రహించి, వేప చెట్టుపై అమ్మవారు దర్శనమిచ్చారనే ప్రచారం జరుగుతుంది. వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన ఘటన చెట్లను నరికి వేయొద్దని సందేశాన్ని అమ్మవారు స్పష్టంగా తెలియజేసారని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటన వైరల్ అవుతోంది.
పవిత్రా లోకేష్ కేసులో కొత్త ట్విస్ట్
నటి పవిత్రా లోకేష్ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల క్రితం తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. నరేష్ తో ఉన్న తన ఫోటోలను వాడి యూట్యూబ్ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తెలుపుతూ 15 యూట్యూబ్ ఛానళ్లపై ఆమె కేసు పెట్టింది. అయితే తాజాగా ఈ యూట్యూబ్ ఛానెల్స్ వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి హస్తం ఉందని మరోసారి ఫిర్యాదు చేసింది. మొదటి నుంచి ఆమె తనపై నెగెటివ్ గా మాట్లాడుతుందని, అందరి ముందు తన పరువు తీయాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తుందని ఆరోపించింది. అంతేకాకుండా గతంలో కూడా తనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించిందని, తనను రోడ్డుకీడ్చింది ఆమెనని చెప్పుకొచ్చింది. ఇక పవిత్ర ఇచ్చిన ఫిర్యాదుపైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇకపోతే రమ్య కొన్నిరోజుల క్రితం నరేష్- పవిత్ర జంటను హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకున్న విషయం తెల్సిందే. కాగా, ఇప్పటివరకు ఈ విషయమై స్పందించింది లేదు. మరి ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ నియామకాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 6100 సివిల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 22న, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోస్టుల దరఖాస్తు తేదీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,511 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో సివిల్ విభాగంలో 3580 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టులు, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టులు, 2520 ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కాగా ఇటీవల ప్రతి ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల పోలీసు శాఖను సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు పోలీసు శాఖ 6,511 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉప్పలపాటి ఇంటి కోడలయ్యే అర్హత ఆమెకు వుందా?
ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. దానంలో కర్ణుడు.. రూపంలో బాహుబలుడు.. అభిమానుల గుండెల్లో దేవుడు. అలాంటి రాజుకు ఎలాంటి రాణి వస్తుంది అనేది ఎన్నోఏళ్లుగా అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. మొదటి నుంచి ఆ స్థానాన్ని అనుష్క భర్తీ చేస్తుందని అభిమానులు కళలు కన్నారు. అది కలగానే మిగిలిపోతుందని, అనుష్క స్థానాన్ని ఇప్పుడు కృతి సనన్ భర్తీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉప్పలపాటి ఇంటి కోడలిగా అయ్యే లక్షణాలు ఆమెకు ఉన్నాయా అని అభిమానులు సందేహపడుతున్నారు. కృష్ణంరాజు బతికి ఉన్నప్పుడు నిత్యం ఆయన ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచించేవారట. ప్రభాస్ కు తగిన అమ్మాయిని, ఉప్పలపాటి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే అమ్మాయి కోసం వెతుకుతున్నామని ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని కృష్ణంరాజు ఇష్టపడడం లేదని, అందుకే అనుష్కను సైతం వద్దు అన్నారని అప్పట్లో టాక్ కూడా నడిచింది.
ఖతార్ లో టెన్షన్.. టెన్షన్.. మొరాకో అభిమానుల సంబరాలు
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిపా ప్రపంచకప్ పోటీల్లో మొరాకోతో జరిగిన మ్యాచ్ లో బెల్జియం ఓటమి పాలైంది. తన ప్రత్యర్థి మొరాకో తల పడగా బెల్జియం 0-2 తేడాతో ఓడిపోయింది. దీంతో మొరాకో జెండా కప్పుకున్న అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన బ్రసెల్స్‌లోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు కారణమైంది. కొందరు దుకాణాల అద్దాలను పగలగొట్టారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. ఫేవరెట్‌లలో ఒకటిగా ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం బరిలోకి దిగింది. ప్రపంచ టాప్ జాబితాలో 22వ ర్యాంకర్‌గా ఉన్న మొరాకో చేతిలో ఓడిపోవడంతో బెల్జియం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. గ్రూప్-‘ఎఫ్’లో భాగంగా ఆదివారం అల్-తుమామా స్టేడియంలో జరిగిన పోరులో మొరాకో బెల్జియంపై విజయం సాధించింది. ఆ తర్వాతనే మొరాకో అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆనందంలో బాణాసంచా కాల్చారు. ఇదే ఇప్పుడు అక్కడ అల్లర్లు సృష్టించింది. అభిమానులు కొందరు దుకాణాల అద్దాలను పగలగొట్టారు. వాహనాలను తగలబెట్టారు.