Top Headlines @1PM: రేపు రామప్ప ఆలయానికి రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ములుగు జిల్లాలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ప్రత్యేక హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ బృందం ఏర్పాట్లను…