Ayesha Meera Mother: నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం తేవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayesha Meera Mother: విజయవాడలో అయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఇంకెన్నాళ్లు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయేషా మీరా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ.. అయేషా హత్యకు గురై 15 ఏళ్లు అయ్యిందని.. ఐపీఎస్ అధికారి ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. సత్యం బాబును అరెస్టు చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదన్నారు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ స్వీకరించిందని.. తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయించారని.. తమ దగ్గర ఉన్న అన్నీ వివరాలు సీబీఐకి ఇచ్చామన్నారు. తమ మత పెద్దలు నాడు రీ పోస్ట్ మార్టం కోసం అంగీకరించలేదని.. ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారని వివరించారు.
Read Also: Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్‌కు బ్రేక్..?
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
మూడేళ్లుగా తమ పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును బైఫర్ కేషన్ చేశామని అధికారులు అంటున్నారని.. సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయిందని విమర్శలు చేశారు. అందుకే తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అసలైన దోషులకు శిక్ష పడి న్యాయం జరిగే వరకు ముందుకు సాగుతామన్నారు. తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగిందన్నారు. అందువల్ల జగన్ ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలని కోరారు. నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వైపు సహకారం అందించాలన్నారు.
అయేషా హత్యపై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నామని గంగా భవానీ వెల్లడించారు. 2007లో చనిపోయిన నాటి నుంచి 2019 వరకు అనేక శాఖల అధికారులు దర్యాప్తు చేశారని.. సీబీఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారన్నారు. వారు ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం కూడా అందించలేదన్నారు. మోదీ, జగన్ ప్రభుత్వాలపై తమకు నమ్మకం లేదన్నారు. అందుకే సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు కూడా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!