Droupadi Murmu: శక్తి లేకుండా శివుడు సంపూర్ణంగా లేడు అన్నారు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము. ఇవాల ఉదయం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం మయ్యారు రాష్ట్రపతి. అనంతరం వారితో మాట్లాడుతూ.. మన విద్యా విధానంలో క్రమశిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ విద్య విధానం గాంధీ పాటించారు కాబట్టే.. స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. చిన్నారులకు చిన్ననాటి నుంచి వ్యావహారికత కూడా నేర్పాలని అన్నారు. జీవించేందుకు తిండి, బట్ట, ఇల్లు కొంత చదువుంటే చాలన్నారు. ఒక్క ఇల్లు ఉంటే సరిపోతుంది కానీ.. ఇక్కడ ఉంటే అక్కడ సొంత ఇల్లు కావాలనుకుంటారన్నారు. జీవితంలో సంతృప్తి అనేది ముఖ్యమన్నారు. అనారోగ్యకర పోటీతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్రపతి. నేను మంచిగా ఉన్నాను అనే భావన ఉండాలన్నారు. వేల కోట్లు ఉన్నా ఆరడుగుల స్థలం, తినడానికి రెండు రొట్టెలే కదా కావాల్సిందని ముర్ము తెలిపారు.
Read also: Sergey Lavrov: యుద్ధం ముగించాలంటే.. ఉక్రెయిన్ ఆ షరతుల్ని పూర్తి చేయాలి
నా జీవితం పై నేను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. పక్క వాళ్ళతో పోల్చుకుని జీవిస్తే ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. మన ఇంట్లో తిండి కంటే హోటల్ లో తిండి మంచిగా అనిపిస్తుందని అన్నారు. అలాంటి విధానం సరైంది కాదన్నారు. నీ సంస్కృతిపై నీకు సంతృప్తి ఉండాలన్నారు. సంస్కృతి తక్కువగా అనిపించినా ప్రేమించాలని వివరించారు. మన ఒరిజినాలిటీని వదిలి పెట్టుకోకూడదన్నారు రాష్ట్రపతి ముర్ము. మహిళా, పురుషులు అన్న తేడా ఉండకూడదన్నారు. మహిళలకు పనుల్లో రిస్త్రిక్షన్ ఉండకూడదని పేర్కొన్నారు. శక్తి లేకుండా శివుడు సంపూర్ణంగా లేడన్నారు. ఇప్పటికీ ప్రతి గ్రామంలో గ్రామదేవతలు ఉంటారన్నారు. మహిళలు రక్తం ఎవరికైనా ఇవ్వొచ్చు.. నేను నాలుగు సార్లు ఇచ్చానని రాష్ట్రపతి తెలిపారు. మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికో చేరుకున్నారని, మహిళలపై ఉన్న దృక్కోణంను ఇప్పటి నుంచే మార్చుకోవాలన్నారు. పిల్లలు ఎవరితో కలుస్తున్నారు? ఎలాంటి వారితో మాట్లాడుతున్నారు? అనేది తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. సమాజాన్ని బాగు పర్చేందుకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, జనాభా భారిగా పెరిగింది, చాలా అంశాల్లో మార్పు రావాలన్నారు. రాజ్యాంగంలో రాసిన అంశాలను మనం అమలు పరచాలన్నారు. పార్లమెంట్ సభ్యులే కాదు మనం కూడా ఫోలో కావాలన్నారు. సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
Read also: Draupadi Murmu: రేపు రామప్ప ఆలయానికి రాష్ట్రపతి.. భక్తులను అనుమతించబోమన్న అధికారులు
బాలబాలికలు సరైన దారిలో వెళ్ళకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. భారత్ ను ఎలా చూడాలి అనుకుంటున్నావు అంటూ రాష్ట్రపతి విద్యార్థిని ప్రశ్నించారు. యూఎస్ తరహాలో మనదేశం లేదు.. అక్కడ జనాభా ఎంత? అక్కడ ఎన్ని జాతులు ఉంటాయి? యూఎస్ తరహాలో మనం లేమన్నారు. మన సిస్టంలో మనం ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. బయట దేశాలకు చెందిన చాలామంది మన సంస్కృతి నేర్చుకుంటున్నారని తెలిపారు. దేశంలో ప్రతి సంస్కృతికి ఒక మంచి కథ ఉంటుందని తెలిపారు. పిల్లలు ఏం చెబుతున్నారో వాటిపై కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి దానిపై డిబెట్ పెట్టాలన్నారు. వారిని చెబుతున్న అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధులను ఎప్పటికి గుర్తు పెట్టుకుంటామన్నారు. భవిష్యత్తు జనరేషన్ కోసం వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం క్రియేటివిటీ ని మేల్కొలుపుతుందని అన్నారు. ఈ విధానం దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్ కోసం అనువైన విధానమన్నారు. అండర్ స్టాండింగ్ పెంచుకునేందుకు ఎక్కువగా చదవాలని అన్నారు. హైదరాబాద్ ఆపర్చునిటీస్ కూ కేంద్రంగా ఉందని రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్‌కు బ్రేక్..?