షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ రెగ్యులర్ ఎస్ఆర్కే ఎంటర్టైనర్ కాదు. ‘జీరో’ మూవీ తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్న బాద్షాని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే, తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా రొమాంటిక్ స్టార్ షారుఖ్ ఈసారి ‘రా ఏజెంట్’గా రచ్చ చేయబోతున్నాడు. ‘పఠాన్’కి అసలు హైలైట్ హై ఓల్టేజ్ యాక్షనే అంటున్నారు!
సీక్రెట్ ఏజెంట్ గా షారుఖ్ నటిస్తున్న ‘పఠాన్’లో దీపిక కూడా మరో ‘రా ఏజెంట్’గా ఫైట్స్ చేయబోతోందట! జాన్ అబ్రహాం విలన్ గా బీభత్సం సృష్టించబోతున్నాడు! అయితే, జనాల్లో యమ ఆసక్తి రేపుతోన్న ‘పఠాన్’ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఫారిన్ లో కొంత షూటింగ్ తరువాత ముంబైలో అనుకున్న షెడ్యూల్ మధ్యలో ఆగిపోయింది. లాక్ డౌన్ సమయంలో అన్ని చిత్రాల్లాగే ‘పఠాన్’కి కూడా ఇబ్బంది తప్పలేదు. కానీ, బాలీవుడ్ లో 29 ఏళ్లు పూర్తి చేసుకున్న కింగ్ ఖాన్… సరిగ్గా తన బీ-టౌన్ యానివర్సరీ రోజే… ‘పఠాన్’ షూటింగ్ రీస్టార్ట్ చేశాడట! ఇక ఈసారి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారట దర్శకనిర్మాతలు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ ముంబై షెడ్యూల్ తరువాత విదేశాలకు వెళ్లనుంది. పలు ఇంటర్నేషనల్ లోకేషన్స్ లో పిక్చరైజేషన్ కొనసాగించే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నాడట. చూడాలి మరి, షారుఖ్ ఖాన్ హై ఓల్టేజ్ థ్రిల్లర్ వచ్చే సంవత్సరం ఎప్పటికి మన ముందుకు వస్తుందో…