ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పౌరాణిక చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా 3డి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన క్యారెక్టర్ రామభక్తుడు హనుమంతుడు. ఈ పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో టి సీరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ప్రారంభమైంది. రాబోయే మూడవ షెడ్యూల్ ఈ రోజు (జూలై 3) ముంబైలో ప్రారంభమవుతుంది.
Read Also : ఉత్కంఠభరితంగా “కుడి ఎడమైతే” టీజర్
తాజాగా దర్శకుడు ఓం రౌత్ తన కారులో షూట్ లొకేషన్‌కు ప్రయాణిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్నారు. దానికి అతను #ఆదిపురుష్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో “రాధే శ్యామ్” తుది షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత ముంబైలోని “ఆదిపురుష్” జట్టులో చేరనున్నాడు. “ఆదిపురుష్” 2022 ఆగస్టు 11న థియేటర్లలో పలు ఇండియా భాషలలో విడుదల కానుంది.