సింగర్ బిల్లీ ఎల్లిష్ సారీ చెప్పింది. ‘’నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఇంతకీ, 19 ఏళ్ల పాప్ సింగర్ సారీ వెనుక కథేంటి అంటారా? బిల్లీ ఓ సారి ఎప్పుడో ఒక పాట పాడింది. ఆ వీడియో ఏళ్ల తరువాత ఇప్పుడు టిక్ టాక్ లో తిరిగి బయటకొచ్చింది. వైరల్ అవుతోంది. అంత వరకూ బాగానే ఉన్నా అందులో ఒక పదం ఆసియా ఖండం నుంచీ వచ్చి అమెరికాలో స్థిరపడ్డవార్ని అవమానించేలా, వెటకారం చేసేలా ఉందట! దీనిపై క్రమంగా దుమారం పెరుగుతోంది. అయితే, వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న బిల్లీ తన వర్షన్ మొత్తం ఇన్ స్టాలో స్టోరీ రూపంలో షేర్ చేసింది.
Also Read : బీటీఎస్ ‘బట్టర్’… 23 ఏళ్ల కిందటి అరుదైన రికార్డ్ రిపీట్!
ఆ పాట నేను పాడానని, ఆ వాడకూడని పదం వాడానని… తలుచుకుంటేనే ఇబ్బందికరంగా ఉంది. నేను సిగ్గుతో తల దించుకుంటున్నాను అంటోంది బిల్లీ ఎల్లిష్. ఇప్పుడు ఆమె 19 ఏళ్లు. కానీ, ఆ పొరపాటు చేసినప్పుడు 13 లేదా 14 ఏళ్లు ఉంటాయట. తాను వాడుతున్న పదం ఏంటో, ఎందుకో తెలియక ఉపయోగించిందట. అంతే తప్ప ఆసియా వాసుల్ని కించపరచటం తన ఉద్దేశం ఎప్పుడూ కాదని వివరణ ఇచ్చింది. అయినా, తాను చేసింది తప్పేనంటూ ‘సారీ’ కూడా చెప్పింది టాలెంట్ సింగర్. బిల్లీ ఎల్లిష్ తాజా ఆల్బమ్ ‘హ్యాపియర్ ద్యాన్ ఎవర్’ జూలై 30న రిలీజ్ కాబోతోంది…