బాలీవుడ్ లో ఒక్కొక్కరుగా స్టార్స్ అంతా పనిలో పడుతున్నారు. ఆలియా భట్ కూడా లాక్ డౌన్ తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే ‘గంగూభాయ్ కతియావాడి’ కంప్లీట్ చేసిన ఆమె నెక్ట్స్ ‘డార్లింగ్స్’ మూవీపై దృష్టి పెట్టింది. తన స్వంత బ్యానర్ ‘ఎటర్నల్ సన్ షైన్’ పతాకంపై తొలిసారి నిర్మాతగా మారి ‘డార్లింగ్స్’ రూపొందిస్తోంది. ఆమెతో బాటు షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి కానుంది.
‘డార్లింగ్స్’ సినిమా కోసం ఆలియా ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తెలిపింది. మూవీ స్క్రిప్ట్ కి సంబంధించిన పుస్తకాన్ని ఫోటో తీసి నెటిజన్స్ తో షేర్ చేసుకుంది. ‘మై డేట్ టూడే’ అంటూ లవ్ ఎమోజీతో పాటూ క్యాప్షన్ రాసింది…
‘డార్లింగ్స్’ సినిమా ఓ తల్లికూతుళ్ల కథ. ముంబై లాంటి మహానగరంలో ఆ మిడిల్ క్లాస్ మదర్ అండ్ డాటర్ తమ సవాళ్లని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా తమకు కావాల్సిన ప్రేమని అందిపుచ్చుకున్నారు అన్నదే కథాంశం. జస్మిత్ దర్శకత్వం వహిస్తోన్న ‘డార్లింగ్స్’లో షెఫాలీ షా, రోషన్ మాథ్యూ, విజయ్ వర్మ లాంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆలియా భట్ ‘డార్లింగ్స్’ కంటే ముందుగానే ‘గంగూభాయ్ కతియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో కనిపించనుంది. చూడాలి మరి, ఇప్పటికే ఆడియన్స్ కి ‘డార్లింగ్’గా మారిన హాట్ బ్యూటీ ‘డార్లింగ్స్’ సినిమాతో నిర్మాతగా ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో!